గుంటూరు కారం సినిమా టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ ని రాబట్టే పనిలో ఉంది. మొదటి వరం 212 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు బాక్సాఫీస్ స్టామినా ఏంటో ప్రూవ్ చేస్తుంది. డివైడ్ టాక్ వచ్చినా, రెండో రోజు నుంచే సినిమా థియేటర్స్ లో ఉండదు అనే మాట వినిపించినా కూడా ఫ్యామిలీ ఆడియన్స్ గుంటూరు కారం సినిమాని నిలబెట్టారు. మహేష్ సోలోగా చేసిన షోకి ఆడియన్స్ రిపీట్ మోడ్ లో థియేటర్స్ కి వస్తున్నారు. ఈ ఒక్క కారణంగానే గుంటూరు కారం సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్ కి చేరువలో ఉంది లేదంటే ఈ పాటికి భారీ నష్టాలని ఫేస్ చేయాల్సి వచ్చేది. త్రివిక్రమ్ మ్యాజిక్ కంప్లీట్ గా వర్క్ చేసి ఉంటే గుంటూరు కారం ఇంపాక్ట్ మరింత ఎక్కువగా ఉండేది కానీ మాంత్రికుడి కలం పదను కాస్త తగ్గిందనే చెప్పాలి.
సింపుల్ గా చెప్పాలి అంటే గుంటూరు కారం సినిమా కూడా అతడు, ఖలేజా చిత్రాల్లాగా ఆడియన్స్ ని తర్వాతి రోజుల్లో ఎంటర్టైన్ చేస్తుంది కానీ మేకర్స్ కి, మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ కి మాత్రం సూపర్ హిట్ ఇవ్వలేకపోయింది. ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ కారణంగా సక్సస్ ఫుల్ గా సెకండ్ వీక్ లోకి ఎంటర్ అయిన గుంటూరు కారం సినిమాని దర్శక ధీరుడు రాజమౌళి, కీరవాణితో కలిసి ఏఎంబీ థియేటర్ లో సినిమా చూశాడని సమాచారం. గుంటూరు కారం సినిమా గురించి జక్కన నుంచి ఎలాంటి స్టేట్మెంట్ బయటకి రాలేదు. గుంటూరు కారం సినిమా నుంచి బయటకి వచ్చిన మహేష్ బాబు నెక్స్ట్ రాజమౌళి సినిమా కోసం రెడీ అయ్యే పనిలో ఉన్నాడు. ఈ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ గురించి ముందు ముందు ఎలాంటి అప్డేట్స్… ఎప్పుడెప్పుడు బయటకి వస్తాయో చూడాలి.