Site icon NTV Telugu

Rajamouli : రాజమౌళి మొదటి జీతం ఎంతో తెలుసా..?

Rajamouli

Rajamouli

Rajamouli : ఎస్ ఎస్ రాజమౌళి అంటే ఇప్పుడు ఇండియాలోనే టాప్ డైరెక్టర్. ఒక్క సినిమా తీస్తే వందల కోట్ల రెమ్యునరేషన్. స్టార్ హీరోలు ఆయన కోసం క్యూ కడుతుంటారు. ఆయన దగ్గర పనిచేయడానికి ఎంతో మంది రెడీగా ఉన్నారు. అలాంటి రాజమౌళి కూడా మొదట్లో ఎవరికీ పెద్దగా తెలియని వ్యక్తే కదా. ఆయన మొదటి జీతం ఎంతో తెలుసుకోవాలనే తపన చాలా మందికి ఉంటుంది. తాజాగా దానికి ఆన్సర్ ఇచ్చేశారు రాజమౌళి.

Read Also : The Rajasaab : ది రాజాసాబ్ పార్ట్-2.. డైరెక్టర్ మారుతి క్లారిటీ..

నాగార్జున, ధనుష్ హీరోలుగా వచ్చిన కుబేర మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాజమౌళి చీఫ్ గెస్ట్ గా వెళ్లారు. ఇందులో ఆయనకు యాంకర్ సుమ ఓ ప్రశ్న వేసింది. మీరు మొదట తీసుకున్న జీతం ఎంత, ఎవరు ఇచ్చారు అని అడగ్గా.. రాజమౌళి ఆన్సర్ ఇచ్చారు. ‘నేను మొదట్లో అసిస్టెంట్ ఎడిటర్ గా పనిచేసిన్పపుడు నాకు మొదటి జీతం రూ.50 ఇచ్చారు. అదే నా మొదటి సంపాదన’ అంటూ చెప్పేశారు.

రాజమౌళి మొదట్లో సీరియల్స్ తీశారు. ఆ తర్వాతనే సినిమాల్లోకి వచ్చి స్టార్ డైరెక్టర్ గా ఎదిగారు. ప్రస్తుతం మహేశ్ బాబుతో భారీ అడ్వెంచర్ మూవీ తీస్తున్నారు. కుబేర మూవీ జూన్ 20న రిలీజ్ కాబోతోంది.

Read Also : Love Scam : ప్రేమన్నాడు.. పెళ్లాన్నాడు.. 15 లక్షలు బిల్లేశాడు.. ఇక్కడే అసలు ట్విస్ట్..!

Exit mobile version