Site icon NTV Telugu

Raghavendra Rao : నన్ను ఈ స్థాయికి తెచ్చింది ఆ స్టార్ హీరోనే : రాఘవేంద్రరావు

Raghavendra Rao

Raghavendra Rao

Raghavendra Rao : స్టార్ డైరెక్టర్ రాఘవేంద్రరావు అంటే తెలియని వారు ఉండరు. తెలుగు ఇండస్ట్రీలో దర్శకేంద్రుడిగా పేరు తెచ్చుకున్నారు. ఎన్నో వైవిధ్యభరితమైన సినిమాలు తీసిన చరిత్ర ఆయనది. రాజమౌళి లాంటి దర్శకుడిని ఇండస్ట్రీకి అందించారు. ఎంతోమందిని స్టార్ హీరోలను చేశారు. ఇంకెంతో మందికి నటన నేర్పించారు. అలాంటి దర్శకేంద్రుడిని స్టార్ ను చేసింది ఓ హీరో అంట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. తాజాగా ఆయన పర్యవేక్షణలో వచ్చిన వెబ్ సిరీస్ కథాసుధ. ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీలో వస్తోంది. అయితే తాజాగా సిరీస్ ప్రమోషన్లలో ఆయన పాల్గొన్నారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కెరీర్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.

Read Also : RR vs PBKS : జైస్వాల్ రాయల్ బ్యాటింగ్.. పంజాబ్ టార్గెట్ 206 రన్స్..

‘నేను ఈ స్థాయికి రావడానికి కారణం సీనియర్ ఎన్టీఆర్. ఆయనతో తీసిన అడవి రాముడు నాకు కెరీర్ ను ప్రసాదించింది. ఆ సినిమా అప్పట్లో వంద రోజులు ఆడింది. ఆ మూవీ షీల్ట్ ను ఇప్పటికీ నా ఇంట్లో పెట్టుకున్నాను. ఎన్టీ రామారావుతో చాలా సినిమాలు చేశాను. కానీ ఆయన నటన ముందు నాకు ఎప్పుడూ ఆశ్చర్యం వేసేది. ఆయన లాంటి నటుడిని నేను ఇప్పటికీ చూడలేదు. నా శిష్యుడిగా వచ్చిన రాజమౌళి ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో ఆకట్టుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇండస్ట్రీకి నేను రాజమౌళిని ఇచ్చాను అనే ఒక సంతృప్తి నాకు ఉంది అది చాలు’ అంటూ చెప్పుకొచ్చాడు రాఘవేంద్రరావు. ఆయన ప్రస్తుతం సినిమాలు తీయకుండా కొన్ని సినిమాలకు పర్యవేక్షణ చేస్తున్నారు.

Exit mobile version