Site icon NTV Telugu

Puri Jagannadh: బిగ్ బ్రేకింగ్.. నా కుటుంబం ఆపదలో ఉంది.. పోలీసులకు పూరి ఫిర్యాదు

Puri

Puri

Puri Jagannadh: డైరెక్టర్ పూరి జగన్నాథ్ చుట్టూ ప్రమాదం పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. లైగర్ సినిమా బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు తమకు డబ్బులు ఇవ్వాలని,లేకపోతే ఇంటికి వచ్చి ధర్నా చేస్తామని బెదిరిస్తునట్లు ఇటీవలే పూరి ఆడియో లీక్ లో చెప్పిన విషయం విదితమే. అయితే తాజాగా వారి నుంచి తన కుటుంబానికి ప్రాణ హానీ ఉన్నదని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను, ఫైనాన్సియర్ శోభన్ లు తన కుటుంబంపై దాడి చేయడానికి ఇతరులను ప్రేరేపిస్తున్నారని ఫిర్యాదులో తెలిపాడు. వారి నుంచి తనను, తన కుటుంబాన్ని రక్షించాలని పోలీసులను కోరాడు.

అసలు విషయం ఏంటంటే.. విజయ్ దేవరకొండ తో తీసిన లైగర్ ఇటీవల విడుదలై భారీ పరాజయాన్ని మూటకట్టుకుంది. దీనివలన పూరితో పాటు డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు తీవ్రంగా నష్టపోయారు. డైరెక్టర్ గా పూరికి ఇవ్వాల్సిన భాద్యత లేకపోయినా ఎంతో కొంత సర్దుబాటు చేసి డబ్బు ఇస్తాను అని చెప్పినా వారు వినకుండా పూరి ఇంటిపై దాడి చేయడానికి రమ్మని మిగతా వారిని రెచ్చగొడుతున్నారు అని తెలుస్తోంది. ఇక ఈ ఫిర్యాదును అందుకున్న పోలీసులు విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు.

Exit mobile version