యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవలే “రాధేశ్యామ్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పెద్దగా ఆదరణ లభించకపోవడంతో నెక్స్ట్ మూవీపై అందరి దృష్టి పడింది. ప్రభాస్ నెక్స్ట్ మూవీ ‘సలార్’ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న విషయం తెలిసిందే. అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రాలలో ఒకటిగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘సలార్’లో ప్రభాస్ డైనమిక్ రోల్‌లో కనిపించనుండగా, శృతిహాసన్ కథానాయికగా నటిస్తుంది. ఇప్పటికే ‘సాలార్’ 30 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు సమాచారం. అయితే గత కొన్ని రోజుల నుంచి ఈ సినిమా కథకు సంబంధించి కొన్ని రూమర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిపై తాజాగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ క్లారిటీ ఇచ్చారు.
Read Also : Will Smith : చెంప దెబ్బ ఎఫెక్ట్ గట్టిగానే… హీరోపై అకాడమీ షాకింగ్ నిర్ణయం
‘కేజీఎఫ్ : చాప్టర్ 2’ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న దర్శకుడు ప్రశాంత్ నీల్ ‘సలార్’కి సంబంధించిన రూమర్లపై స్పందించారు. ఒకవైపు ‘కేజీఎఫ్’ ఫ్రాంచైజీకి కొనసాగింపుగా ‘సలార్’ వస్తోంది అని, మరోవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన కన్నడ చిత్రం ‘ఉగ్రమ్’కి ‘సలార్’ రీమేక్ అని కొన్ని కథనాలు ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేసే పనిలో పడ్డాయి. తాజాగా ప్రశాంత్ నీల్ ఈ రూమర్లను కొట్టి పారేస్తూ “నేను చేసే అన్ని చిత్రాలలో కొన్ని ఉగ్రం ఛాయలు ఉంటాయి. అది నా శైలి! అయితే సలార్ తాజా కథ. ఇది ఉగ్రమ్ రీమేక్ లేదా సీక్వెల్ కాదు. ఇది ‘సలార్’ ఒరిజినల్ కథ… మరే ఇతర ఫ్రాంచైజీకి చెందినది కాదు” అంటూ స్పష్టం చేయడంతో పుకార్లకు తెర పడింది.
