సూపర్ స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన సినిమా ‘సర్కారు వారి పాట’. ఈ సినిమాకు గీతాగోవింద్ ఫేమ్ పరుశురాం దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే.. నేడు హైదరాబాద్ యూసఫ్‌గూడాలోని పోలీస్ గ్రౌండ్స్‌లో ‘సర్కారు వారి పాట’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరుగుతోంది. ఈ వేడుకలో డైరెక్టర్ పరుశురాం మాట్లాడుతూ.. ఈ సినిమా కథ మహేశ్‌బాబుకు చెప్పేందుక వెళ్లినప్పుడు చాలా భయం వేసిందన్నారు. కానీ.. కథ చెప్పడం స్టార్ చేసిన 5 నిమిషాల తరువాత.. మహేశ్ గారు ఓ చిరునవ్వు నవ్వారని.. ఆ చిరునవ్వే ఇక్కడి వరకు తీసుకువచ్చిందన్నారు.
అంతేకాకుండా.. మహేశ్ గారు నాకు.. ఓ మెసేజ్ పెట్టారు.. అందులో.. ఐ వాంట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్.. పరుశురాం.. అని పెట్టిన మెసేజ్ నన్ను ఇంతవరకు తీసుకువచ్చింది అని ఆయన వెల్లడించారు. మహేశ్‌బాబు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయలేదని, సర్కారు వారి పాట సినిమా నా దగ్గర నుంచి ఏం కోరుకుందో.. బెస్ట్ ఇచ్చానని పరుశురాం అన్నారు. జన్మంతా మహేశ్‌బాబుకు థ్యాంక్స్ చెప్పుకున్న తక్కువేనని, ఐ లవ్ యూ సర్.. అంటూ పరుశురాం.. మహేశ్‌బాబు గురించి మాట్లాడారు.
https://www.youtube.com/watch?v=OtnfbfBxDPI
