Site icon NTV Telugu

Kalyan G Gogana: ‘కళింగరాజు’ రూపకల్పనలో ‘తీస్ మార్ ఖాన్’ డైరెక్టర్!

Kalinga Raju

Kalinga Raju

 

”నాటకం, సుందరి, తీస్ మార్ ఖాన్” వంటి విభిన్నమైన కథా చిత్రాలను తెరకెక్కించారు కళ్యాణ్ జీ గోగణ. విభిన్నమైన జానర్లలో సినిమాలు తీస్తూ తెలుగు చిత్రసీమలో తనదైన మార్క్ వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవలే మాస్ కమర్షియల్ సినిమా అంటూ ‘తీస్ మార్ ఖాన్‌’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆయన దర్వకత్వంలో మరో కొత్త చిత్రం రాబోతోంది. నవయుగ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద రాబోతోన్న ఈ చిత్రానికి ‘కళింగరాజు’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. రవికుమార్, ఐ. రవి కిరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నేహా సింగ్ సమర్పకురాలిగా, రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ ఖుషీ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ నటుడు ఈ చిత్రంలో హీరోగా నటించబోతోన్నారు. ఈ సినిమాకు శేఖర్ నీలోజి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పని చేయనున్నారు. ఈ చిత్రాన్ని త్వరలోనే లాంఛనంగా ప్రారంభించనున్నారు.

ఎన్నో వందల చిత్రాలకు పని చేసిన చోటా కె. ప్రసాద్ ‘కళింగరాజు’ మూవీకి ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ‘తీస్ మార్ ఖాన్’ వంటి కమర్షియల్ సినిమాకు తన ఫోటోగ్రఫీతో మెప్పించిన బాల్ రెడ్డి.. ఈ సినిమాకు కెమెరామెన్‌గా పని చేయనున్నారు. ప్రస్తుత సంగీత దర్శకుల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలిని ఏర్పర్చుకున్న సురేష్ బొబ్బిలి ఈ సినిమాకు మ్యూజిక్ అందించనున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను చిత్రయూనిట్ ప్రకటించనుంది.

Exit mobile version