NTV Telugu Site icon

Circle Movie: ‘సర్కిల్’ ఎమోషనల్ థ్రిల్లర్‌..అసలు విషయం బయటపెట్టిన నీలకంఠ

Neelakanta Circle Movie

Neelakanta Circle Movie

Director Neelakanta interview on Circle Movie: నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ నీలకంఠ రూపొందించిన కొత్త సినిమా “సర్కిల్” జూలై 7న ఆడియన్స్ ముందుకు రానుంది. సాయి రోనక్, బాబా భాస్కర్, అర్షిణ్‌ మెహతా, రిచా పనై , నైనా కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాను ఆరా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎమ్‌వీ శరత్ చంద్ర, టి.సుమలత అన్నిత్ రెడ్డి, వేణుబాబు అడ్డగడ నిర్మించారు. సరికొత్త థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ దగ్గరపడ్డ క్రమంలో ఈ క్రమంలో చిత్ర దర్శకుడు నీలకంఠ మీడియాతో ముచ్చటించారు. నీలకంఠ మాట్లాడుతూ మాయ సినిమా తర్వాత తొమ్మిదేళ్ల గ్యాప్ అనంతరం తెలుగులో సినిమా తీస్తున్నానని, తెలుగులో మళ్లీ సినిమా తీయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. సరికొత్త కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించామని, ఫేట్ (విధి) అనే కాన్సెప్ట్ ఓ వందమందిని ఓ సర్కిల్‌లోకి తీసుకొచ్చి.. ఎట్లా వారి జీవితాలను అల్లకల్లోలం చేసిందని మెయిన్ థీమ్‌గా తీసుకున్నామని అన్నారు. ఇది రొమాంటిక్, క్రైమ్ థ్రిల్లర్ కాదు. ఇన్వెస్టిగేషనల్ టైప్‌లో కాకుండా.. ఎమోషనల్ థ్రిల్లర్‌గా రన్ చేశానాకు నీలకంఠ అన్నారు.

Posani krishnamurali: నంది అవార్డులపై పోసాని కీలక ప్రకటన.. ఉత్తములు, అర్హులకు ఇస్తాం!

ఈ సినిమాలో సాయి రోనక్ ఫొటో గ్రాఫర్‌గా కనిపిస్తాడని, అన్‌హ్యూమన్ సర్కిల్‌లోకి అతన్ని ఎలా లాగబడ్డాడు..? అనేది అక్కడి నుంచి కథ రివీల్ అవుతుందని అన్నారు. సినిమాకి రొమాంటిక్ యాంగిల్ కూడా జత చేశామన్న ఆయన ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేశారని అన్నారు.. నా గత సినిమాల్లో మాదిరే హీరోయిన్స్‌కు ఈ మూవీలో కూడా ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చానని, ముగ్గురు హీరోయిన్లు మూడు డిఫరెంట్ రోల్స్ ప్లే చేశారని, సినిమాలో వాళ్ల లైఫ్‌ను వాళ్లే డిసైడ్ చేసుకుని ముందుకు సాగుతారని నీలకంఠ అన్నారు. ఈ ఇనిమలో బాబా భాస్కర్ గారి క్యారెక్టర్‌ ఎవరూ ఊహించని విధంగా ఉంటుందని, ఆయన అందరికీ ఓ కొరియోగ్రాఫర్‌గానే తెలుసని అన్నారు. బాబా భాస్కర్ ఫస్ట్ టైమ్ ఓ కీలక పాత్రలో నటించాడని, తనదైన శైలిలో కామెడీని టచ్ చేస్తూనే విలన్‌గా మెప్పించాడని అన్నారు.

ఈ పాత్రకు ఆయన కరెక్ట్‌గా సెట్ అయ్యారని, హీరోనా.. విలన్ అని చూడలేదు, బాబా భాస్కర్‌ను చూడగానే క్యారెక్టర్‌కు సెట్ అవువతాడని అనిపించిందని అన్నారు. నా సినిమాలు అన్ని కాన్సెప్ట్ ఓరియంటెడ్‌గా ఉంటాయని,. నా మూవీస్ అన్ని క్రిటికల్‌గా రన్ అయ్యాయని నీలకంఠ అన్నారు.. నేను స్టార్ హీరోలతో చేయాలని కాదు, కాన్సెప్ట్‌ మీదే ఎక్కువగా వర్క్ చేశా, త్వరలో కుదిరితే స్టార్ హీరోలతో కూడా సినిమాలు చేస్తానని నీలకంఠ అన్నారు.. మాయ సినిమా తరువాత రెండు ప్రాజెక్ట్‌లకు సైన్ చేశా కానీ అనుకోని కారణాలతో అవి ఆగిపోయాయి. మాయ మూవీని హిందీలో చేయాలని మహేష్ భట్ గారు అడిగారు కానీ లాస్ట్ మినిట్‌లో అది ఆగిపోయిందని మరో రెండు సినిమాలు దగ్గరకు వచ్చి ఆగిపోయాయి. ఆ తర్వాత ఓ మలయాళం సినిమా తీశానని అందుకే గ్యాప్ వచ్చిందని నీలకంఠ అన్నారు.

Show comments