ప్రభాస్ – పూజ హెగ్డే జంటగా రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రాధేశ్యామ్. జనవరి 14న విడుదలకానున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రాండ్ గా జరుగుతోంది. ఇక ఈ ఈవెంట్ కి ప్రభాస్ నటిస్తున్న తదుపరి చిత్రాల డైరెక్టర్లందరూ స్టేజిపై సందడి చేశారు. ఇక ప్రభాస్ తో ‘ప్రాజెక్ట్ కె’ చిత్రం చేస్తున్న నాగ్ అశ్విన్ మాట్లాడుతూ” ట్రైలర్ నాకు బాగా నచ్చింది. ఈ ఈవెంట్ కి ఇంతమంది డైరెక్టర్లు వచ్చాం.. అందరు పాన్ ఇండియా .. పాన్ ఇండియా అంటున్నాం.
అస్సలు పాన్ ఇండియా.. పాన్ ఇండియా కాన్సెప్ట్ స్టార్ట్ చేసింది ప్రభాస్ మరియు రాజమౌళి గారివల్ల.. వాళ్ళు కట్టిన ప్లాట్ ఫార్మ్ మీద మేము ఎక్కి అలా చూడగలుగుతున్నాం.. ఈ ఈవెంట్ లో నేను భాగమవ్వడం చాలా సంతోషంగా ఉంది. రాధే శ్యామ్ ఇంటెన్సీటివిటీ లవ్ స్టోరీ .. ట్రైలర్ చూస్తూనే అర్ధమవుతుంది.. ప్రభాస్ – పూజ కెమిస్ట్రీ చాలా బావుంది. ఇక ప్రాజెక్ట్ కె గురించి మాట్లాడితే.. అమితాబ్ బచ్చన్ గారు, దీపికా పడుకొనే తెలుగులో మాట్లాడుతుండగా.. ప్రభాస్ హిందీ మాట్లాడారు. వచ్చే ఏడాది మా వేడుకలో కలుద్దాం అంటూ చెప్పుకొచ్చారు. ఇక డిసెంబర్ 14 న అందరు థియేటర్లో సినిమా చూడాల్సిందిగా కోరారు.
