NTV Telugu Site icon

Prabhas: డార్లింగ్ లగ్జరీ కారులో డైరెక్టర్.. నీకు సెట్ అవ్వలేదు బ్రో

Maruthi

Maruthi

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన సంగతి తెలిసిందే. నాలుగు పాన్ ఇండియా సినిమాల మధ్య ఒక చిన్న సినిమాను చేస్తున్నాడు ప్రభాస్. మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన కోలీవుడ్ బ్యూటీ మాళవిక మోహనన్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా మరో ముగ్గురు ముద్దుగుమ్మలు సందడి చేయనున్నారట. హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిట్రంలో డార్లింగ్ అల్ట్రా స్టైలిష్ లుక్ లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా సెట్స్ నుంచి లీకైన ప్రభాస్ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేసింది. తాజాగా ఈ సినిమా డైరెక్టర్ అయిన మారుతీ ఫోటో ఒకటి నెట్టింట హల్చల్ చేస్తోంది.. ఓ లగ్జరీ కారులో స్టైలిష్ గా కూర్చొని ఫొటోకు పోజ్ ఇచ్చాడు మారుతీ… ఒక్క నిమిషం.. ఈ కారును ఎక్కడో చూసినట్టు ఉందే అనుకుంటున్నారా..? అవునండీ అది మన డార్లింగ్ లంబోర్గినినే.
Jamuna: జమున బయోపిక్.. స్టార్ హీరోయిన్ ఛాన్స్ పట్టేసిందే..?

ప్రభాస్ కు కార్లంటే పిచ్చి అని అందరికి తెల్సిందే. ఇండియాలోనే అత్యధిక ఖరీదు కలిగిన లంబోర్గిని కారును మొదట కొన్నది ప్రభాస్ మాత్రమే. ఇక ఆ కారులోనే మారుతీ షికారుకు వెళ్లి వచ్చి ఇదుగో ఇలా ఫొటోకు పోజ్ ఇచ్చాడు. ఇక ఈ ఫోటో చుసిన డార్లింగ్ అభిమానులు తమదైన రీతిలో స్పందిస్తున్నారు.అన్నా.. ఫోటోలు తీసుకోవడమేనా.. సినిమా అప్డేట్ ఇచ్చేది ఏమైనా ఉందా..? అని.. ఏమైనా ఆ కారు నీకు సెట్ అవ్వలేదు బ్రో అని మరికొందరు చెప్పుకొస్తున్నారు. ప్రస్థితం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ సినిమాతో ప్రభాస్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Show comments