రెబల్ స్టార్ ప్రభాస్ “రాజా సాబ్” మూవీ రిలీజైన 4 రోజుల్లో 201 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను వరల్డ్ వైడ్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో “రాజా సాబ్” సక్సెస్ హ్యాపీనెస్ ను ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూ లో షేర్ చేసుకున్నారు డైరెక్టర్ మారుతి. “రాజా సాబ్” సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ దక్కుతోంది. సంక్రాంతి హాలీడేస్ బిగిన్ కాకముందే ఈ సినిమా 200 కోట్ల రూపాయల మార్క్ టచ్ చేయడం హ్యాపీగా ఉంది. సంక్రాంతి మూడ్ లో ఉంటారు కాబట్టి ప్రేక్షకులు అలాంటి ఒక లైటర్ వేన్ సినిమా ఎక్స్ పెక్ట్ చేసి ఉంటారు.
Also Read :Maruthi: ప్రభాస్ ప్రశాంతంగా ఉండమన్నారు..
ఈ మొత్తం ప్రాసెస్ లో నేను స్ట్రాంగ్ గా ఉన్నాను. అందుకే సినిమా రిలీజైన రెండో రోజు మీ ముందుకు వచ్చి మాట్లాడాను. నాకు అనుకున్న టైమ్ కు సినిమా రిలీజ్ చేయాలి అనే వర్క్స్ లోనే టెన్షన్ పడుతూ ఉండిపోయా. అందుకే నేను రిలీజ్ కు ముందు ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో అలసిపోయినట్లు కనిపించాను. ఏ సినిమా గురించి సోషల్ మీడియాలో ట్రోల్స్ రాలేదో చెప్పండి. ప్రతి సినిమాకు వస్తుంటాయి. నలుగురు చెడుగా మాట్లాడితే నలభై మంది వెళ్లి సినిమా చూస్తున్నారు. సినిమా బాగుంది కదా అని అంటున్నారు. ప్రీమియర్ షోస్ కు అనుమతి, బుకింగ్స్ ఇలాంటివి నా పరిధిలోకి రావు. నేను సినిమాను ఇన్ టైమ్ రిలీజ్ కు రెడీ చేసే పనిలోనే ముగినిపోయాను అని అన్నారు.
