యాక్సిడెంట్ నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత సాయి ధరమ్ తేజ్ వరుసగా క్రేజీ ప్రాజెక్టుల్ని లైన్‌లో పెడుతున్నాడు. ఈ క్రమంలోనే ఇతడు దర్శకుడు మారుతితో మరోసారి చేతులు కలపనున్నట్టు ఓ గాసిప్ గుప్పుమంది. ఆల్రెడీ వీరి కలయికలో ‘ప్రతిరోజూ పండగే’ సినిమా వచ్చింది. తండ్రి సెంటిమెంట్‌తో వచ్చిన ఆ సినిమా మంచి విజయం సాధించడంతో.. తేజ్, మారుతి మరో మూవీ చేయాలని నిర్ణయించుకున్నారని టాక్ వినిపించింది. ఆల్రెడీ వీరి మధ్య కథా చర్చలు నడిచాయని, త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా రానున్నట్టు జోరుగా ప్రచారం జరిగింది.
అయితే.. ఈ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని తాజాగా తేలిపోయింది. తేజ్, మారుతి ఓ సినిమా కోసం చేతులు కలపడం కాదు కదా.. అసలు వీరి మధ్య ఎలాంటి చర్చలూ జరలేదని వెల్లడైంది. ప్రస్తుతం మారుతి కేవలం ప్రభాస్ ప్రాజెక్ట్ పైనే పూర్తి దృష్టి సారించాడని సన్నిహిత వర్గాలు స్పష్టం చేశాయి. అటు సాయి ధరమ్ తేజ్ తాను ఒప్పుకున్న ఇతర ప్రాజెక్టుల్లో నిమగ్నమయ్యాడని తెలిసింది. ఇద్దరు తమతమ సినిమాలతో బిజీగా ఉన్నారని, ఇప్పట్లో వీరు కలవడం అసాధ్యమేనని, వీరి కాంబో సెట్ అయినట్టు వస్తున్న వార్తలు అవాస్తమని చెప్తున్నారు. సో.. అదన్నమాట సంగతి!
