Maruthi Next : మారుతీ డైరెక్షన్ లో వరుణ్ తేజ్.. అవసరమా అధ్యక్ష్యా?

Maruthi Varun Tej

Maruthi Varun Tej

రాజాసాబ్ డిజాస్టర్ తర్వాత దర్శకుడు మారుతి ఓ ఛాన్స్ కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నాడు. పలువురి హీరోల పేర్లు వినిపించాయి  కానీ అవేవి కార్యరూపం దాల్చలేదు. రాజాసాబ్ ప్లాప్ ఎఫెక్ట్ మారుతీతో సినిమా చేసేందుకు జంకుతున్నారు హీరోలు. ఇక ఈ దర్శకుడుకి నెక్ట్స్ ఎవరు ఛాన్స్ ఇస్తారనే టైమ్ లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా మారుతీ ఓ రీజనబుల్ బడ్జెట్‌తో కొత్త కథను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్లు  వార్తలు వినిపించాయి.

ప్రస్తుతం వరుణ్ తేజ్ నటించిన ‘కొరియన్ కనకరాజు’ విడుదలకు సిద్ధంగా ఉండగా ఆ తర్వాత నిహారిక నిర్మిస్తున్న ‘బరి’ చిత్రంలో నటించనున్నారు. ఈ రెండు ప్రాజెక్టుల అనంతరం మారుతి-వరుణ్ తేజ్ కాంబో పట్టాలెక్కే అవకాశముందని ఇండస్ట్రీలో న్యూస్ వచ్చింది. ఈ విషయమై ఆరాతీయగా వరుణ్ తేజ్ – మారుతి కాంబినేషన్ కాంబోపై వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని వరుణ్ తేజ్ వర్గాల నుంచి సమాచారం అందింది. మారుతి తదుపరి సినిమా వరుణ్ తేజ్‌తో ఉందనడం 100% రాంగ్ న్యూస్ అని స్పష్టం చేసారు. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న వార్తలన్నింటినీ కేవలం రూమర్లుగానే కొట్టిపారేస్తున్నారు. కొరియన్ కనకరాజ్ షూటింగ్ లో టైమ్ లో వరుణ్ తేజ్ కాలికి గాయం అయింది. ఓ వైపు ఆ నొప్పి భరిస్తూనే ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు వరుణ్ తేజ్. ఆగస్టు 7న ఈ సినిమా రిలీజ్ అయ్యాక కాస్త గ్యాప్ తీసుకుని బరి షూట్ లో పాల్గొంటాడు వరుణ్.