Site icon NTV Telugu

The Rajasaab : ది రాజాసాబ్ పార్ట్-2.. డైరెక్టర్ మారుతి క్లారిటీ..

Rajasaab

Rajasaab

The Rajasaab : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న ది రాజాసాబ్ మూవీ టీజర్ నేడు రిలీజ్ చేశారు. టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ఇందులో ప్రభాస్ వింటేజ్ లుక్ లో కనిపిస్తున్నారు. అలాగే వీఎఫ్ ఎక్స్ వర్క్ కూడా బాగుంది. ఇందులో ప్రభాస్ డ్యూయెల్ లో రోల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దెయ్యం సినిమాకు తగ్గట్టు బీజీఎం, విజువల్స్ బాగానే ఉన్నాయి.

Read Also : Mahesh Kumar Goud: మంత్రి పొంగులేటి పై చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సీరియస్..!

అయితే ఈ సినిమాకు పార్ట్-2 కూడా ఉంటుందనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. తాజాగా దానిపై డైరెక్టర్ మారుతి క్లారిటీ ఇచ్చారు. పార్ట్-2 కోసం బలవంతంగా కథను సాగదీసి రుద్దే వ్యక్తిని కాదు. అలాంటిదేమీ లేదు. ఎవరూ కంగారు పడొద్దు.

మేం సినిమాను మంచి క్వాలిటీతో తీశాం. దాన్ని చెడగొట్టే ప్రయత్నం చేయను. ప్రభాస్ ఫ్యాన్స్ పెట్టుకున్న నమ్మకాన్ని ఈ సినిమా నిలబెట్టుకుంటుంది. మేం రోజుకు 12 గంటలు పనిచేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. మూవీ ఔట్ పుట్ అద్భుతంగా వచ్చింది’ అంటూ తెలిపాడు మారుతి.
Read Also : Pranitha : వారి కారణంగా నేను ఇండస్ట్రీ‌కి దూరం అయ్యాను..

Exit mobile version