NTV Telugu Site icon

Director Krish: నేను ఎక్కడికి పారిపోలేదు.. ఈ కేసులో నన్ను కావాలనే ఇరికించారు

Krish

Krish

Director Krish: ర్యాడిసన్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి కూడా ఉన్నట్లు గతకొన్ని రోజులుగా పోలీసులు తెలుపుతున్న విషయం తెల్సిందే. ఎఫ్ఐఆర్ లో ఎనిమిదో నిందితుడిగా క్రిష్ ను చేర్చారు. పార్టీ జరుగుతున్న సమయంలో క్రిష్ ర్యాడిసన్ హోటల్ లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పార్టీ జరుగుతున్న రూమ్లో అరగంట పాటు కూర్చున్నారని, ర్యాడిసన్ యజమాని వివేకానందతో ఆయన మాట్లాడినట్లు పోలీసులు తెలిపారు. ఇక ఆ తరువాత క్రిష్.. ఈ డ్రగ్స్ కేసుతో తనకు సంబంధం లేదని కూడా చెప్పుకొచ్చాడు. తాను హోటల్ కు వెళ్లడం నిజమే అని, సాయంత్రం ఆరు గంటల 45 నిమిషాలకు తాను హోటల్ నుంచి బయటకు వచ్చేసానని, హోటల్ యజమాని వివేకానందతో అప్పుడే పరిచయం ఏర్పడిందని తెలిపాడు. తన డ్రైవర్ లేకపోవడంతో వివేకానందతో అరగంట పాటు మాట్లాడానని, డ్రైవర్ రాగానే పార్టీ నుంచి వెనక్కి వెళ్లిపోయినట్లు చెప్పుకొచ్చాడు. ఈ విషయం పోలీసులకు కూడా చెప్పాను అని కూడా చెప్పాడు. అయితే వివేకానంద చెప్తేనే క్రిష్ పేరును ఎఫ్ఐఆర్ లో నమోదు చేసినట్లు పోలీసులు తెలుపుతున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే గత వారం రోజుల నుంచి క్రిష్ పరారీలో ఉన్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక తాజాగా తాను ఎక్కడికీ పారిపోలేదని తెలియజేస్తూ.. క్రిష్ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం అప్లై చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇక క్రిష్ పిటిషన్ పై హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. అనంతరం క్రిష్ మాట్లాడుతూ.. ” నాకు, ఈ డ్రగ్స్ కేసుకు ఎలాంటి సంబంధం లేదు. వివేకానందతో మాట్లాడిన మాట వాస్తవమే.. ఆరోజు జరిగింది మొత్తం నేను పోలీసులకు చెప్పాను. రెండురోజులు గడువు కావాలని, శుక్రవారం పోలీసుల దగ్గరకు నేనే వస్తాను అని చెప్పాను. అంతలోనే క్రిష్ పరారీ అని చెప్పుకొస్తున్నారు. వివేకానంద ఇచ్చిన స్టేట్మెంట్ వలనే నా పేరు పోలీసులు చేర్చారు. నేను డ్రగ్స్ తీసుకున్నాను అనడానికి ఎటువంటి అధరాలు లేవు. నన్ను కావాలనే ఈ కేసులో ఇరికించారు” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Show comments