Director Krish Revoked Petition on Drugs Case at Highcourt: హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన రాడిసన్ డ్రగ్స్ కేసు రోజు రోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. డ్రగ్స్ కేసులో పెడ్లర్ అబ్బాస్ అలీని అదుపులో తీసుకున్న పోలీసులకు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. డైరెక్టర్ క్రిష్ కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు అబ్బాస్ తెలుపడంతో కేసు నమోదు చేశారు పోలీసులు. డైరెక్టర్ క్రిష్ కి పోలీసుల నోటీసులు జారీ చేశారు. అయితే సమాధానం రాకపోవడంతో క్రిష్ పరారీలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై క్రిష్ క్లారిటీ ఇచ్చారు. తను పలుకారణల వల్ల హైదరాబాద్ కు దూరంగా ఉన్నానని త్వరలోనే హాజరు అవతానని క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో నిన్న ఉదయం మాదాపూర్ డీసీపీ ఆఫీస్ కి డైరెక్టర్ క్రిష్ వచ్చారు.
Nihir Kapoor: అడవి నుంచి డబ్ల్యూ డబ్ల్యూ ఈ దాకా.. సాగే ప్రయాణమే మా రికార్డ్ బ్రేక్
క్రిష్ డ్రగ్స్ టెస్ట్ ల కోసం శాంపిల్స్ కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది. క్రిష్ బ్లడ్, యూరిన్ శాంపిల్స్ ను పోలీసులు ల్యాబ్ కు పంపారు. ఇక ఇప్పటికే క్రిష్ యూరిన్ టెస్ట్ లో నెగిటివ్ గా రిపోర్ట్ వచ్చాయని పోలీసులు తెలిపారు. ఇక ఈ క్రమంలో తాను హైకోర్టులో వేసిన పిటిషన్ ను విత్ డ్రా చేసుకున్నాడు డైరెక్టర్ క్రిష్. ఈ డ్రగ్స్ కేసలో పోలీసులు అరెస్టు చేయకుండా అదేశాలు ఇవ్వాలని కోరుతూ కొద్ది రోజుల క్రితం పిటిషన్ దాఖలు చేశారు ఆయన. ఇప్పటికే డ్రగ్స్ కేసులో పోలీసుల ముందు విచారణ హాజరైన క్రిష్ దాఖలు చేసిన పిటిషన్ ను విత్ డ్రా చేసుకుంటున్నట్టు హైకోర్టుకు క్రిష్ తరపు న్యాయవాది తెలిపారు.