Site icon NTV Telugu

Director Krish: క్రిష్ డ్రగ్స్ తీసుకున్నాడు.. రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు?

Director Krish Drugs Case

Director Krish Drugs Case

Director Krish consumed drugs says abbas ali in remand: హైదరాబాదులో పోలీసులకు ఎక్కడ డ్రగ్స్ దొరికినా దానికి టాలీవుడ్ లింక్స్ దొరుకుతూ ఉండడం సంచలనం రేపుతోంది. ఇటీవల కాలంలో గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్ లో డ్రగ్స్ దందా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ డ్రగ్స్ అమ్మకం దారుడు సయ్యద్ అబ్బాస్ అలీ రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు తెరమీదకు వస్తున్నాయి. ఈ డ్రగ్స్ కేసులోని ఎఫ్ఐఆర్లో మరో ఇద్దరిని తాజాగా నిందితులుగా చేర్చారు పోలీసులు. ఈ కేసులో గజ్జల వివేకానంద డ్రైవర్ ప్రవీణ్ ఏ11గా డ్రగ్ సప్లయర్ మీర్జా వహీద్ ను ఏ12గా పోలీసులు నమోదు చేశారు. గత ఏడాది నుంచి గజ్జల వివేకానంద డ్రగ్స్ కి బానిస అయినట్లు అబ్బాస్ తమ విచారణలో తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. అంతేకాదు రాడిసన్ హోటల్ లో వివేక్ తన స్నేహితులు క్రిష్, నిర్భయ్ సింధీతో కలిసి డ్రగ్స్ తీసుకున్నాడని అబ్బాస్ వెల్లడించారు.

Rashmika Mandanna: జపాన్ కు బయల్దేరిన రష్మిక మందన్న.. సినిమా కోసం కాదు..

ఈ నెల 24వ తేదీన రాడిసన్ హోటల్ లో జరిగిన డ్రగ్ పార్టీలో డైరెక్టర్ క్రిష్ కూడా పాల్గొన్నట్టు అబ్బాస్ వెల్లడించాడని సమాచారం. ఇక ఈ పార్టీలో శ్వేత, లిషి, నీల్, డైరెక్టర్ క్రిష్ కూడా డ్రగ్స్ తీసుకున్నారని, ముందు నుంచి డ్రగ్స్ పార్టీ జరిగిన ప్రతిసారి రాడిసన్ హోటల్ లో క్రిష్, నిర్భయ్ కలుసుకున్నారని అబ్బాస్ పేర్కొన్నట్లు తెలుస్తోంది. మీర్జా వహీద్ బేగ్ నుంచి గ్రామ కొకైన్ 14వేల కి కొనుగోలు చేశానని వివేకా సూచనలు మేరకు అతని వ్యక్తిగత డ్రైవర్ గద్దల ప్రవీణ్ కి డ్రగ్స్ అందజేస్తున్నానని అబ్బాస్ పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈనెల 24వ తేదీన మధ్యాహ్నం వివేకానంద తన స్నేహితులు రఘుచరణ్, కేదార్, సందీప్, శ్వేత, లిషి, నీల్, డైరెక్టర్ క్రిష్ తో కలిసి డ్రగ్స్ పార్టీ చేసుకున్నారని హోటల్లోని 1200, 1204 నెంబర్ గా రెండు గదుల్లో డ్రగ్స్ సేవించారని అబ్బాస్ వెల్లడించారు. ఇక ఇదే క్రమంలో వివేక్ తన స్నేహితులను డ్రగ్స్ పార్టీకి ఆహ్వానించిన వాట్సప్ చాటింగ్ కూడా గుర్తించినట్లుగా పోలీసులు చెబుతున్నారు. అయితే డైరెక్టర్ క్రిష్ తాను ముంబైలో బిజీగా ఉండటంవల్ల విచారణకు హాజరు కాలేనని పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయంలో పోలీసులు ఎలా ముందుకు వెళతారు అనేది చూడాల్సి ఉంది.

Exit mobile version