Happy Birthday Director Koratala Siva : (కొరటాల శివ పుట్టిన రోజు 15th) రైటర్ గా అతి కొద్ది సినిమాలతోనే తానేమిటో నిరూపించుకున్న కొరటాల శివ తొందరానే మెగాఫోన్ పట్టేశాడు. హిట్టు మీద హిట్టు కొట్టేశాడు. అయితే ఐదో సినిమా మాత్రం తనని బాగా నిరాశ పరచింది. అందుకే ఆరో సినిమాని ఎలాగైనా హిట్ చేయాలని తెగ ఆరాట పడిపోతున్నాడు. జూన్ 15న కొరటాల శివ బర్త్ డే. తనకి బర్త్ డే విషెస్ చెబుతూ తెలుగు చిత్రసీమలో తన జర్నీపై ఓ లుక్కేద్దాం.
AAA Cinemas: సొంత మల్టీప్లెక్స్ లాంఛ్ చేసిన బన్నీ
రచయితగా తమకంటూ మంచి పేరు తెచ్చుకున్నవారు మెగాఫోన్ పట్టేసీ అలరించిన వైనం కొత్తేమీ కాదు. కొరటాల శివ సైతం అదే బాటలో పయనించారు. ‘గర్ల్ ఫ్రెండ్’ సినిమాకు రవి అనే మరో రచయితతో కలసి కథ అందించిన శివ తరువాత బోయపాటి శ్రీను తొలి చిత్రం ‘భద్ర’కు రచయితగా పనిచేశారు. ఆపై “సింహా, బృందావనం, ఊసరవెల్లి” చిత్రాలకూ రచయితగా కొనసాగారు. తన రైటింగ్ స్కిల్స్ కి గుర్తంపు రావటంతో దర్శకుడు కావాలన్న అభిలాషతో ‘మిర్చి’ కథను తయారు చేసుకుని ప్రభాస్ తో సినిమా రూపొందించారు. ‘ఛత్రపతి’ తరువాత ఆ స్థాయి సక్సెస్ లేని ప్రభాస్ కు ‘మిర్చి’తో అదరహో అనిపించేలా అనూహ్య విజయాన్ని అందించారు. అంతే తెలుగు చిత్ర పరిశ్రమలో అందరి కళ్ళూ కొరటాల శివ వైపు తిరిగాయి.
T Series: టాలీవుడ్ పై కన్నేసిన టీ సిరీస్.. హైదరాబాద్ లో పాగా!
‘మిర్చి’ సక్సెస్ ఘాటు స్టార్ హీరోస్ ను తాకింది. మహేశ్ బాబు, కొరటాల శివతో జట్టు కట్టాడు. తొలి సినిమా ‘శ్రీమంతుడు’తోనే హిట్టు పట్టాడు. తరువాత కొరటాల శివ మూడో సినిమాగా జూనియర్ యన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’ వచ్చింది. ఈ సినిమా సైతం అనూహ్య విజయం సాధించింది. దాంతో కొరటల శివ దర్శకుడుగా ‘హ్యాట్రిక్’ అందుకున్నారు. హ్యాట్రిక్ చూసిన కొరటాల శివతో మహేశ్ బాబు రెండో సారి జట్టుకట్టాడు. ఫలితం ‘భరత్ అనే నేను’ జనం ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద బంపటర్ హిట్ అయింది. వరుసగా నాలుగు బ్లాక్ బస్టర్స్ చూసిన కొరటాల శివ ఆ తర్వాత చిరంజీవి, రామ్ చరణ్ తో ‘ఆచార్య’ సినిమా తీశారు. అయితే ఈ సినిమా తనకు చేదు ఫలితాన్ని అందించింది. ఇప్పుడు ఆరో సినిమా ‘దేవర’తో మరో బ్లాక్ బస్టర్ కొట్టాలన్న కసితో శివ పనిచేస్తున్నారు. ఈ సినిమాకోసం జూనియర్ యన్టీఆర్, కొరటాల శివ రెండోసారి కలసి పనిచేస్తున్నారు. ‘దేవర’తో ఎలాగైనా హిట్ పట్టాలన్నదే వారి ధ్యేయం. వచ్చే ఏప్రిల్ 5న ‘దేవర’ రిలీజ్ కి ప్లాన్ చేశారు. బాగా గ్యాప్ తీసుకుని చేస్తున్న ‘దేవర’తో శివ ఏ స్థాయి విజయాన్నిఅందుకుంటాడో చూద్దాం