NTV Telugu Site icon

Harish Shankar: ‘ఉస్తాద్ భగత్ సింగ్’కి బ్రేక్? ‘రైడ్’తో రెడీ?

Harish Shankar

Harish Shankar

సింగల్ లైనర్స్ ని సూపర్బ్ రాయడంలో, హీరో క్యారెక్టర్ తోనే హిట్ కొట్టడంలో పూరి జగన్నాథ్ తర్వాత అంతటి డైరెక్టర్ హరీష్ శంకర్ మాత్రమే. హరీష్ శంకర్ ఒక హీరోకి లో యాంగిల్ షాట్ పెట్టి, ఒక వన్ లైనర్ డైలాగ్ వదిలితే చాలు థియేటర్స్ లో మాస్ ఆడియన్స్ విజిల్స్ వేయాల్సిందే. అరెవో సాంబ రాస్కోరా అంటూ గబ్బర్ సింగ్ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన హరీష్ శంకర్. మళ్లీ పవన్ కళ్యాణ్ తో కలిసి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీపై అనౌన్స్మెంట్ నుంచే హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కాంబినేషన్ మెగా ఫాన్స్ కి సూపర్ కిక్ ఇస్తుంది. ఆ అంచనాలకి తగ్గట్లు ఉస్తాద్ భగత్ సింగ్ గ్లిమ్ప్స్ ని రిలీజ్ చేసి యుట్యూబ్ రికార్డ్స్ ని బ్రేక్ చేసారు. ఒక్క గ్లిమ్ప్స్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై అంచనాలని పెంచిన హరీష్ శంకర్, మరోసారి పవన్ కళ్యాణ్ తో ఇండస్ట్రీ హిట్ కొడతాడు అనే నమ్మకం అందరిలో కలిగింది. అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

పవన్ కళ్యాణ్ OG సినిమా కంప్లీట్ చేస్తూనే పాలిటిక్స్ లో కూడా ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ సమయంలో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కి కష్టమవుతుంది అనే బ్రేక్ ఇచ్చారనే మాట ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది. ఇందులో ఎంత నిజముంది అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది కానీ ప్రస్తుతం వినిపిస్తున్న రూమర్ ప్రకారం అయితే ఉస్తాద్ భగత్ సింగ్  కి బ్రేక్ పడింది, హరీష్ శంకర్ ఇంకో సినిమాని సెట్ చేసే పనిలో ఉన్నాడు. హిందీలో అజయ్ దేవగన్ నటించిన ‘రైడ్’ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాని మాస్ మహారాజ రవితేజతో హరీష్ శంకర్ రీమేక్ చేయబోతున్నాడట. రవితేజ బాడీ లాంగ్వేజ్ కి హరీష్ శంకర్ కలిస్తే ఎలా ఉంటుందో మిరపకాయ్ సినిమాలో చూసేసారు కాకపోతే మిరపకాయ్ సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా ఉంటుంది కానీ రైడ్ సినిమా సీరియస్ డ్రామా. ఒకవేళ రవితేజ-హరీష్ శంకర్ రూమర్ నిజమైతే సీరియస్ ఎమోషన్ ని రవితేజతో హరీష్ శంకర్ ఎంత వరకూ ఫుల్ ఆఫ్ చేస్తాడు అనేది చూడాలి.