NTV Telugu Site icon

Harish Shankar: అది అట్టా ఏసుకో మావా… ఆ కామెంట్స్ ఆ దర్శకుడికేనా?

Harish Shankar

Harish Shankar

టిల్లు వేణు దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన సినిమా ‘బలగం’. చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి సూపర్బ్ టాక్ తో థియేటర్స్ లో రన్ అవుతున్న ఈ మూవీ అన్ని వర్గాల నుంచి కాంప్లిమెంట్స్ అందుకుంటుంది. లేటెస్ట్ గా బలగం సినిమా సక్సస్ మీట్ ని కూడా చేశారు. ఈ ఈవెంట్ గురించి, ఈ ఈవెంట్ లో హరీష్ శంకర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. KGF సినిమాపై, ఆ సినిమా పేరు తీయ్యకుండా దర్శకుడు వెంకటేష్ మహా చేసిన కామెంట్స్ బ్యాక్ లాష్ ఫేస్ చేస్తున్నాయి.

ఇదే స్టైల్ లో బలగం సక్సస్ మీట్ లో హరీష్ శంకర్ కూడా వెంకటేష్ మహా పేరు తియ్యకుండా… “అసలే జనాలు థియేటర్లకి రాకుండా ఓటీటీ అంటూ అందులోనే సినిమాలు చూస్తున్నారని ఇలాంటి సమస్యల గురించి కాకుండా క్లాస్ మాస్ కమర్షియల్ ఆర్ట్ అంటూ మాట్లాడడం ఎందుకని అన్నారు. చిన్న సినిమా అయినా సరే మంచిది వస్తే దాన్ని భుజాల మీద వేసుకొని ప్రమోట్ చేసేది మాస్ కమర్షియల్ సినిమాలు తీసే పెద్ద డైరెక్టర్లే అన్న సంగతి మర్చిపోకూడదని చెప్పుకొచ్చారు. ఒకడు సైకిల్ మీద వెళ్తూ చల్లగాలిని ఎంజాయ్ చేస్తే మరొకరు కారులో వెళ్తూ ఏసీ గాలిని ఎంజాయ్ చేస్తాడు. ఎవరి ఎంజాయ్ మెంట్ వారిది, ఎవరి స్థోమత వారిది. అలా అని ఎవరూ తక్కవ కాదు ఎవరూ ఎక్కవ దు. పెరుగన్నం మంచిదని బిర్యానీ వదిలేసి అదే తినాలంటే ఎవరూ తినరని… కాకపోతే బిర్యానీ తిన్నాక పెరుగన్నం తినమని చెప్తే సబబుగా ఉంటుంద” ఇన్ డైరెక్ట్ క్లాష్ పీకాడు. హరీష్ శంకర్ స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సరిగ్గా చెప్పావ్ అంటూ హరీష్ శంకర్ కి సపోర్ట్ చేస్తున్నారు.

Show comments