NTV Telugu Site icon

Hanu Raghavapudi: సెకండ్ హాఫ్ చెడగొడతానని నాకు పేరు ఉంది.. కానీ

Maxresdefault (2)

Maxresdefault (2)

Hanu Raghavapudi: మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సీతారామం. వైజయంతీ మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న కీలక పాత్రలో నటిస్తోంది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక ఈ వేడుకకు డార్లింగ్ ప్రభాస్ ముఖ్య అతిధిగా విచ్చేశాడు. ఈ వేదికపై డైరెక్టర్ హను రాఘవపూడి మాట్లాడుతూ..”ఈ ప్రేమకథను రాయడానికి నేను చాలా యుద్ధం చేశాను.. ఈ ప్రాజెక్ట్ లో నాకన్నా నన్ను ఎక్కువ నమ్మింది స్వప్నా దత్. ఆమె ప్రతి విషయంలో నాకు సపోర్ట్ చేసింది.. కథ విన్నప్పటి నుంచి ఎండ్ అయ్యేవరకు నాకు అన్ని విధాల నాకు సపోర్ట్ చేసింది. రెండు వరుస ప్లాపుల తరువాత కూడా నన్ను నమ్మి ఈ కథను నాతో చేసినందుకు అందరికి థాంక్స్.. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. ఈ సినిమా గురించి అందరిలా చెప్పడం లేదు.. ఈసారి ఖచ్చితంగా హిట్ అందుకొంటుంది. దుల్కర్, సుమంత్, మృణాల్, రష్మిక వీరందరిని ఒప్పించడానికి నేను ఎన్నో యుద్దాలు చేశాను. వారందరు ఈ కథను నచ్చి ఒప్పుకున్నారు.

నేను సెకండ్ హాఫ్ చెడగొడతాను అని ఇండస్ట్రీలో టాక్ ఉంది.. కానీ ఈ సినిమాకు నేను బెస్ట్ సెకండాఫ్ ఇచ్చాను. మిమ్మల్ని ఈ సినిమా నిరాశపర్చదు. ఈ సినిమాను మీరు మళ్లీ మళ్లీ చూస్తూనే ఉంటారు. సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చాకా కూడా మీ మైండ్ నుంచి బయటకి రాదు. ఈ సినిమా ఓటిటీలోకి వచ్చినా చూస్తూనే ఉంటారు. ఈ సినిమాపై నేను ఇంత నమ్మకంగా ఉండడానికి కారణం సినిమా వచ్చిన విధానం.. ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం కేవలం యాక్టర్స్ వలనే.. లొకేషన్స్, విజువల్స్ చాలా సినిమాల్లో ఉంటాయి.. నా సినిమాల్లో కూడా ఉన్నాయి.. చాలాసార్లు వర్క్ అవుట్ అవ్వలేదు.. ఇందులో అవుతుంది. అందరికి ఈ సినిమా నచ్చుతుంది” అంటూ చెప్పుకొచ్చారు.