Gopichand Malineni: రవితేజ ప్లేస్‌లో మరో హీరోనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వీరసింహారెడ్డితో సాలిడ్ బ్లాక్ బస్టర్ కొట్టిన మాస్ డైరెక్టర్ గోపించద్ మలినేని… నెక్స్ట్ ప్రాజెక్ట్ మాస్ మహారాజా రవితేజతో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. డాన్ శీను, బలుపు, క్రాక్ తర్వాత… నాలుగోసారి ఈ క్రేజి కాంబినేషన్ వర్కౌట్ అవడంతో అనౌన్స్మెంట్ నుంచే అంచనాలు పెరిగిపోయాయి కానీ గత కొన్ని రోజులుగా ఈ ప్రాజెక్ట్ ఆగిపోయినట్టుగా ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బడ్జెట్ అనుకున్న దానికంటే ఎక్కువ అవ్వడం వల్ల… మైత్రీ మూవీ మేకర్స్ #RT4GM ప్రాజెక్ట్‌ను హోల్డ్‌లో పెట్టినట్టుగా టాక్ నడుస్తోంది. అసలు మైత్రీ మూవీ మేకర్స్ అనౌన్స్ చేసి… ఈ సినిమాను హోల్డ్ చేయడం ఏంటి? రవితేజ సినిమాకి బడ్జట్ ఇష్యూస్ ఏంటి అనేది రవితేజ అభిమానులకి అంతుబట్టని విషయంగా మారింది.
#RT4GM ప్రాజెక్ట్ ని హోల్డ్ లో పెట్టడం గురించి మైత్రీ మూవీ మేకర్స్ నుంచైతే ఇంకా ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు కానీ ఫిల్మ్ నగర్ వర్గాల్లో మాత్రం ఈ సినిమాను మరో హీరోతో ప్లాన్ చేస్తున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. అది కూడా తమిళ్ లేదా హందీ హీరో కోసం ట్రై చేస్తున్నారట. అన్నీ కుదిరితే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌తో మైత్రీ మూవీస్ ప్లాన్ చేస్తున్నట్టుగా పుకార్లు వస్తున్నాయి. ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే గోపీచంద్ మలినేని-రవితేజ ప్రాజెక్ట్ కాకుండా మరో ప్రొజెక్ట్ ని మైత్రీ మూవీ మేకర్స్ స్టార్ట్ చేయనుంది. #RT4GM ని హోల్డ్ లో పెట్టి ఈలోపు గోపీచంద్ మలినేనితో ఒక మల్టీలాంగ్వేజ్ సినిమా చేసే ఆలోచనలో మైత్రి మూవీ మేకర్స్ ఉన్నట్లున్నారు. మరి #RT4GM స్టార్ట్ అవుతుందా లేక గోపీచంద్ మలినేని మరో హీరోతో ఇంకో సినిమా స్టార్ట్ చేస్తాడా అనేది చూడాలి.
Also Read
- SlumDog – 33 Temple Road: 'స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్' కు డబ్బింగ్ చెప్పిన విజయ్ సేతుపతి... టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
- Anasuya: బాధ్యత ఉండక్కర్లా.. బుచ్చిబాబు'కి అనసూయ పరోక్ష కౌంటర్?
- Peddi Collections : బాక్సాఫీస్ వద్ద 'పెద్ది' కలెక్షన్ల సునామీ.. ఏకంగా ఎన్ని కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందో తెలిస్తే మైండ్ బ్లాక్!
- Athiradi OTT Release Date: 65 కోట్ల మలయాళ హిట్ మూవీ ఓటీటీలోకి... తెలుగులోనూ స్ట్రీమింగ్
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్‌కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!