Director Dasharad: టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ దశరథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంతోషం, సంబరం,శ్రీ, స్వాగతం,మిస్టర్ పర్ పెక్ట్, గ్రీకువీరుడు,శౌర్య లాంటి సినిమాలకు దర్శకత్వం వహించి తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నాడు. కుటుంబ కథా చిత్రాలకు ప్రాధాన్యత ఇచ్చే దశరథ్ కొన్నేళ్లుగా అవకాశాలు లేక ఖాళీగా ఉంటున్నాడు. ఇక ఈ నేపథ్యంలోనే ఆయన ఒక తాజా ఇంటర్వ్యూలులో తన కెరీర్ గురించి, గతం గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. మొదట దశరథ్ రచయిత. ఎన్నో సినిమాలకు ఆయన కథలు అందించాడు. చాలామంది డైరెక్టర్ల వద్ద పనిచేశాడు. అయితే డైరెక్టర్ అవ్వాలనే కోరికతో రైటింగ్ మీద పూర్తిగా దృష్టి పెట్టలేకపోయానని చెప్పుకొచ్చాడు. ఒకవేళ ఆ సమయంలో రైటర్ గా కూడా పనిచేసి ఉంటే .. ఇప్పుడు తన పరిస్థితి వేరుగా ఉండేదని చెప్పుకొచ్చాడు.
Rajamouli: వెకేషన్ లో ఉన్నారు.. వదిలేయండయ్యా
” మొదట్లో నేను డైరెక్టర్ తేజ దగ్గర రైటింగ్ డిపార్ట్మెంట్ లో పనిచేశాను. అప్పుడు వెర్షన్ రైటర్ కు చాలా డిమాండ్ ఉండేది. తక్కువలో తక్కువ రూ 10 లక్షలవరకు ఇచ్చేవారు. చాలా పెద్ద బ్యానర్స్ నుంచి అవకాశాలు వచ్చేవి. కానీ, నేను వేటిని ఒప్పుకోలేదు. నాకు డైరెక్టర్ కావాలనే ఆశ ఉండేది. ఒక రచయిత.. డైరెక్టర్ గా ఉంటే అవుట్ ఫుట్ మరింత అద్భుతంగా వస్తుంది అని నేను నమ్ముతాను. అందుకే నా కథకు నేనే డైరెక్ట్ చేయాలనీ అనుకునేవాడిని. అందుకే పరుచురి బ్రదర్స్ వద్ద 15 సినిమాలకు పనిచేసి.. డైరెక్టర్ గా మారాను. వారిదగ్గర పనిచేయడం నాకు బాగా కలిసివచ్చింది. ఎన్నో అవకాశాలు వచ్చాయి.. ఎంత డబ్బు ఇవ్వడానికి అయినా వాళ్ళు రెడీ గా ఉండేవాళ్ళు.. కానీ, నేను ఒప్పుకోలేదు. అది తప్పు అని ఇప్పుడు తెలుస్తోంది. ఆ తప్పు నేను చేయకుండా ఉండాల్సింది అని ఇప్పుడు ఫీల్ అవుతున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.