NTV Telugu Site icon

Allu Arjun: షారుఖ్ ‘జవాన్’ సినిమాలో అల్లు అర్జున్-దళపతి విజయ్?

Allu Arjun

Allu Arjun

పఠాన్ సినిమాతో వెయ్యి కోట్ల మార్కెట్ ని టచ్ చెయ్యడానికి రెడీగా ఉన్నారు ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్. అయిదేళ్ల తర్వాత తన సినిమాని రిలీజ్ చేసి, దాదాపు పదేళ్ల తర్వాత హిట్ కొట్టిన షారుఖ్ బాలీవుడ్ లో ఉన్న ప్రతి రికార్డుని బ్రేక్ చేస్తున్నాడు. ఇదే జోష్ లో మరోసారి 2023లో ఇండియన్ బాక్సాఫీస్ ని టార్గెట్ చెయ్యడానికి షారుఖ్ నటిస్తున్న సినిమా ‘జవాన్’. అట్లీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. రెగ్యులర్ షూటింగ్ మొదలైన ఈ మూవీ పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందుతుంది. పఠాన్ సినిమా ఎన్ని వందల కోట్లు తెచ్చినా సౌత్ లో మాత్రం అంత ఇంపాక్ట్ క్రియేట్ చెయ్యలేకపోయింది.

Read Also: Shakuntalam: ఈ పోస్టర్ చాలా హాట్ గురూ…

నార్త్, సౌత్ లెక్కల మధ్య తేడా తగ్గించడానికి అట్లీ, దళపతి విజయ్ ని రంగంలోకి దించుతున్నాడనే వార్త కోలీవుడ్ లో వినిపిస్తోంది. అట్లీ కి సౌత్ లో మంచి క్రెడిబిలిటీ ఉంది, విజయ్ తో కూడా చాలా మంచి రిలేషన్ ఉంది. విజయ్ అట్లీల కాంబినేషన్ లో ఇప్పటికే ఇండస్ట్రీ హిట్ సినిమాలు ఉన్నాయి. ఈ కారణంగానే అట్లీ, జవాన్ సినిమాలో క్యామియో ప్లే చెయ్యించడానికి విజయ్ ని అప్రోచ్ అయ్యాడట. విజయ్ కూడా ఓకే చెప్పడానికి కోలీవుడ్ లో వినిపిస్తున్న మాట. అయితే జవాన్ సినిమా గురించి లేటెస్ట్ గా వినిపిస్తున్న న్యూస్ ఏంటి అంటే అట్లీ, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని కూడా క్యామియో ప్లే చెయ్యమని అడిగాడట. అల్లు అర్జున్ ని జవాన్ సినిమాలో నటించేలా చేస్తే తెలుగు మార్కెట్ ని కూడా సొంతం చేసుకోవచ్చు అనేది అట్లీ ప్లాన్ లా కనిపిస్తుంది. అట్లీ, బన్నీని కలిసి క్యామియో ఎలా ఉండబోతుందో కూడా చెప్పాడని, బన్నీ డెసిషన్ ఇంకా చెప్పలేదని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికీ ఇది రూమర్ మాత్రమే ఎందుకంటే పుష్ప ది రూల్ సినిమాతో బిజీ ఉన్న అల్లు అర్జున్, చిన్న క్యామియో కోసం తన లుక్ ని బయట పెట్టే ఛాన్స్ లేదు. సో జవాన్ సినిమాలో ఆలు అర్జున్ ఉంటాడా? ఉండడా అనేది చూడాలి.

Read Also: Hebah Patel: చీర కట్టిన హెబ్బా.. అబ్బా.. అంటున్న అబ్బాయిలు

Show comments