NTV Telugu Site icon

Brahmaji: డైరెక్టర్ ను కత్తితో బెదిరించిన బ్రహ్మాజీ.. ఎందుకంటే.. ?

Anil

Anil

Brahmaji: టాలీవుడ్ సీనియర్ నటుడు, కమెడియన్ బ్రహ్మాజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎక్కడ ఉంటే అల్లరి, నవ్వులు అక్కడే ఉంటాయి. ఇక వరుస సినిమాలతో దూసుకెళ్తున్న బ్రహ్మాజీ ప్రస్తుతం తన కొడుకును హీరోగా నిలబెట్టే ప్రయత్నాల్లో ఉన్నాడు. బ్రహ్మాజీ కొడుకు సంజయ్ రావు నటించిన చిత్రం స్లమ్ డాగ్ హస్బెండ్. ఈ చిత్రంలో ప్ర‌ణ‌వి మానుకొండ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ సినిమాకి ఏఆర్ శ్రీధ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మైక్ మూవీస్ బ్యాన‌ర్‌పై అప్పిరెడ్డి, వెంక‌ట్ అన్న‌ప‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రం జూలై 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ అన్ని తన భుజాన వేసుకున్న బ్రహ్మాజీ.. కొడుకును తీసుకొని గట్టి ప్రమోషన్స్ చేస్తున్నాడు. ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లు, షోలు అంటూ తెగ తిరుగుతున్నాడు. ఇక తాజాగా బ్రహ్మాజీ.. డైరెక్టర్ అనిల్ రావిపూడిని కత్తితో బెదిరించాడు. షూటింగ్ జరుగుతున్న సమయంలో అనిల్ రావిపూడి మెడపై కత్తిపెట్టి మరీ.. కొడుకు సినిమాను ప్రమోట్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Nithiin: ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ గా నితిన్.. ఆ లుక్ ఏందీ బ్రో..?

అనిల్ రావిపూడి షూటింగ్ చేస్తుండగా .. బ్రహ్మాజీ వచ్చి .. తన కొడుకు సంజయ్ నటించిన స్లమ్ డాగ్ హస్బెండ్ జూలై 29 న రిలీజ్ కానుందని చెప్పమన్నట్లు అడిగాడు. అందుకు అనిల్.. ప్రతిసారి తానే చెప్తున్నాను అని, టీజర్, ట్రైలర్ కు కూడా చెప్పానని.. ఇక చెప్పను అని అనడంతో.. చేతిలో ఉన్న కత్తిని అనిల్ మెడపై పట్టి.. చెప్తావా.. లేదా అని బెదిరించాడు. దీంతో అనిల్.. స్లమ్ డాగ్ హస్బెండ్ జూలై 29 న రిలీజ్ అవుతుంది.. తప్పక చూడండి అని చెప్పాడు. ఆ వెంటనే.. కత్తి తీసేసి వెళ్తుండగా .. ఆ కత్తిని తీసుకొని మన ప్రమోషన్స్ కు ఉపయోగపడుతోంది అని అనిల్ చెప్పడం విశేషం. మరి ఈ సినిమా ఎలాంటి విజయం అందుకుంటుందో చూడాలి.

Show comments