Site icon NTV Telugu

Acharya: ‘ఆర్ఆర్ఆర్’ కోసం అనిల్… ‘ఆచార్య’కి హరీశ్ శంకర్!?

Chiru

Chiru

ఈ మధ్యే విడుదలైన ‘ఆర్.ఆర్.ఆర్.’ టీమ్ అంటే డైరెక్టర్ రాజమౌళి, హీరోలు యన్టీఆర్, రామ్ చరణ్ ను సినిమా రిలీజ్ కు ముందు ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ఇంటర్వ్యూ చేసి ఆకట్టుకున్నారు. అదే తీరున ఇప్పుడు ‘ఆచార్య’ చిత్రం కోసం చిరంజీవి, రామ్ చరణ్, దర్శకుడు కొరటాల శివను మరో నోటెడ్ డైరెక్టర్ హరీశ్ శంకర్ ఇంటర్వ్యూ చేయబోవడం విశేషం! ఆదివారం (ఏప్రిల్ 24న) ఈ ఇంటర్వ్యూ జరిగింది.
సరిగ్గా 35 రోజుల వ్యవధిలో రెండు మల్టీస్టారర్స్ ‘ట్రిపుల్ ఆర్’, ‘ఆచార్య’ జనం ముందు నిలవడం విశేషం.

రాజమౌళి దర్శకత్వంలో యన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ‘ఆర్.ఆర్.ఆర్.’ మార్చి 25నే జనం ముందు నిలచి అలరించింది. ఆ చిత్రం విడుదలైన 35 రోజులకు చిరంజీవి, రామ్ చరణ్ నటించిన కొరటాల శివ చిత్రం ‘ఆచార్య’ ఏప్రిల్ 29న రానుంది. ఈ రెండు సినిమాల్లో కామన్ ఫ్యాక్టర్ రామ్ చరణ్! ఇంతకు ముందు ‘ట్రిపుల్ ఆర్’ టీమ్ లో మెంబర్ గా అనిల్ రావిపూడి అడిగిన పలు ప్రశ్నలకు తనదైన రీతిలో సమాధానమిచ్చి అలరించారు చెర్రీ. ఇప్పుడు హరీశ్ శంకర్ సంధించే ప్రశ్నలకు రామ్ చరణ్ ఇవ్వబోయే జవాబులపై ఆసక్తి నెలకొంది. ఎందుకంటే, అప్పుడంటే తన ఫ్రెండ్ తారక్, డైరెక్టర్ రాజమౌళి తనతో ఉన్నారు. ఇప్పుడు సాక్షాత్తు తన తండ్రి చిరంజీవి కూడా పక్కనే ఉంటారు కాబట్టి, హరీశ్ ప్రశ్నలకు చెర్రీ ఎలాంటి సమాధానమిస్తారో వినాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తారు. మరి ‘ఆచార్య’ ముందు ‘సిద్ధా’ ఎలాంటి జవాబులు చెబుతారో చూడాలి.

Exit mobile version