Site icon NTV Telugu

KA 10 : ‘దిల్ రూబా’ రిలీజ్ డేట్ ఫిక్స్.?

Dilruba

Dilruba

యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం తన కొత్త మూవీ ‘దిల్ రూబా’. కిరణ్ అబ్బవరం కెరీర్ లో 10వ సినిమాగా రానున్న ఈ సినిమాను శివమ్ సెల్యులాయిడ్ ప్రొడక్షన్ మరియు ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తన నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నూతన దర్శకుడు విశ్వ కరుణ్ ‘దిల్ రూబా’ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమవుతున్నాడు.

Also Read : FEB 14 : ప్రేమికుల రోజు స్పెషల్.. టాలీవుడ్ హౌస్ ఫుల్

కిరణ్ అబ్బవరం గతేడాది “క” సినిమాతో  బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఈ సినిమా ఘనవిజయం ఇచ్చిన ఉత్సాహంలో  దిల్ రూబా సినిమాను అనౌన్స్  చేసారు. “క” సూపర్ హిట్ తర్వాత వస్తున్న చిత్రంగా  ‘దిల్ రూబా’ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ మధ్య రిలీజ్ చేసిన ‘దిల్ రూబా’ టీజర్ కు మంచి స్పందన లభించింది. మొదట ఈ సినిమాను ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో  రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. కానీ అనుకోని కారణాల వలన వాయిదా వేస్తూ మరొక రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తాం అని ప్రకటించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ సినిమాను మర్చి 14న రిలీజ్ చేస్తున్నారట. త్వరలోనే ఈ డేట్ ను అధిరేకంగా అనౌన్స్ చేయనున్నారు టీమ్. ఈ  సినిమాలో కిరణ్ అబ్బవరం మెకానికల్ స్టూడెంట్ గా కనిపించబోతున్నారని తెలుస్తోంది. క సినిమాకంటే ముందు రావాల్సిన ఈ సినిమా అనుకోని కారణాల వలన వాయిదాల అనంతరం రాబోతున్న దిల్ రూబా ఏ మేర హిట్ సాధిస్తుందో చూడాలి.

Exit mobile version