NTV Telugu Site icon

Dil Raju: వారసుడు కోసం దిల్ రాజు భారీ ప్లాన్ వేశాడే.. ?

Dil

Dil

Dil Raju: టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో సగం స్టార్ సినిమాలు అన్ని దిల్ రాజు చేతిలోనే ఉన్నాయి. ప్రస్తుతం దిల్ రాజు అంటే.. గేమ్ ఛేంజర్ నిర్మాత. ఈ సినిమాను హార్ట్ కింగ్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఈ సినిమా కనుక హిట్ కొడితే.. దిల్ రాజు కాస్తా.. పాన్ ఇండియా రాజు అయిపోతాడు. ఇక దిల్ రాజు కుటుంబ విషయానికొస్తే.. చక్కగా వారసుడు తో ఆడుకుంటూ సేదతీరుతున్నాడు. గతేడాది దిల్ రాజు రెండో భార్య తేజస్విని ఒక మెగా బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెల్సిందే. బిడ్డ పుట్టాకా దిల్ రాజుకు బాగానే కలిసి వచ్చిందని చెప్పాలి. ఇక అందుతున్న సమాచారం ప్రకారం.. హార్ట్ కింగ్ తన వారసుడు మొదటి పుట్టినరోజును గ్రాండ్ గా చేయాలనీ చూస్తున్నాడట. వచ్చే నెలలోనే వారసుడు పుట్టినరోజు కావడంతో ఇప్పటినుంచే ఆ ప్రిపరేషన్స్ మొదలయ్యాయని తెలుస్తోంది.

Vijay Antony: బిచ్చగాడు.. ‘బ్రో’ తో పోటీ పడుతున్నాడే.. ?

మొదటి నుంచి కూడా దిల్ రాజు ఫ్యామిలీ లో పార్టీ అంటే.. బాలీవుడ్ పార్టీలను తలదన్నేలా ఉంటాయి. ఇక ఇప్పుడు వారసుడు మొదటి బర్త్ డే అంటే మాములు విషయం కాదు. ఆయన కూడా ఈ వేడుకను చిన్నపాటి సినిమా రేంజ్ లో చేయాలనీ ప్లాన్ చేస్తున్నాడట. తెలుగు ఇండస్ట్రీనే కాకుండా తమిళ్, బాలీవుడ్ ప్రముఖులను కూడా పిలిచి ఆతిధ్యం ఇవ్వనున్నారట. సాధారణంగా పార్టీ అంటే.. అందరు హీరోలు అటెండ్ అవుతారు.. అందులోనూ సక్సెస్ ఫుల్ నిర్మాత దిల్ రాజు ఇంట పార్టీ అంటే టాలీవుడ్ మొత్తం వచ్చేస్తోంది. దీంతో ఒక విధంగా దిల్ రాజు పేరు కూడా పక్క ఇండస్ట్రీలకు పాకుతోంది. ఎప్పటినుంచో హార్ట్ కింగ్ తన సామ్రాజ్యాన్ని విస్తరించాలని చూస్తున్నాడు. ఈ వేడుక అందుకు కూడా పనికొచ్చేలా ఉందని చెప్పుకొస్తున్నారు. మరి ఈ వేడుక ఏ రేంజ్ లో జరగుతుందో చూడాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Show comments