Site icon NTV Telugu

Nani: దిల్ రాజు చేతికి సరిపోదా శనివారం థియేట్రికల్ రైట్స్…

Nani

Nani

హాయ్ నాన్న సినిమాతో నాని మంచి హిట్ కొట్టాడు. అసలు థియేటర్స్ లో నిలబడుతుందా అనుకున్న సినిమాని ఆడియన్స్ ఊహించని విధంగా రిసీవ్ చేసుకోని క్లీన్ హిట్ గా మార్చారు. లవ్ స్టోరీ తర్వాత యాక్షన్ మోడ్ లోకి మారుతున్న నాని… నెక్స్ట్ అంటే సుందరానికి సినిమా డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మధ్య కాలంలో నాని నటించిన లైట్ వెయిట్ సినిమా, ఇందులో నాని తనకి టైలర్ మేడ్ రోల్స్ లాంటి పక్కింటి కుర్రాడిలా కనిపిస్తాడు. వివేక్ ఆత్రేయ హిట్ ఇవ్వకపోయినా నాని… ఈ కాంబినేషన్ ని మాత్రం రిపీట్ చేస్తున్నాడు. డీవీవీ దానయ్య ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా ‘సరిపోదా శనివారం’ అనే టైటిల్ తో రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది.

Read Also: Dhanush: సెంచరీకి చేరువలో కెప్టెన్…

ప్రియాంక మోహన్ హీరోయిన్ గా, ఎస్.జే సూర్య ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్న సరిపోదా శనివారం సినిమా ఫుల్ స్వింగ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. లేటెస్ట్ గా సరిపోదా శనివారం సినిమా గురించి డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ నుంచి అప్డేట్ బయటకి వచ్చింది. ఈ సినిమాని రెండు తెలుగు రాష్ట్రాల్లో దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాడు. ఇందుకు సంబంధించిన అనౌన్స్మెంట్ ని మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. శనివారం రోజున… రాహు కాలం, మంచి సమయం చూసుకోని మరీ అనౌన్స్ చేసిన ఈ అప్డేట్ తో నాని ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు అంటే నాని ఓపెనింగ్స్ విషయంలో కెరీర్ బెస్ట్ కొట్టడం గ్యారెంటీ.

Exit mobile version