Dil raju to contest as film chamber president: టాలీవుడ్ లో మరోసారి మాటల యుద్ధం తెర మీదకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి కారణం తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్ష బరిలోకి దిల్ రాజు దిగనుండడమే. ఫిబ్రవరిలో జరిగిన తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికల కోసం దిల్ రాజు, సి కళ్యాణ్ ప్యానెళ్ల మధ్య హోరాహోరీ పోరు నెలకొనగా ఒక వర్గం మీద మరో వర్గం అప్పట్లో తీవ్ర ఆరోపణలు కూడా చేసుకుంది. ఇక ఆ ఎన్నికల్లో దిల్ రాజు ప్యానెల్ ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. అప్పట్లో ఆ విజయాన్ని చూసి చాలా మంది నిర్మాతల మండలిని గిల్డ్ స్వాధీనం చేసుకుందని కూడా కామెంట్లు చేశారు. ఇక ఆ సంగతి పక్కన పెడితే ఇప్పుడు తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి(తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్) ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. ఈసారి ఫిలిం చాంబర్ అధ్యక్ష పదవి నిర్మాతల రంగానికి దక్కనుండడం గమనార్హం. ఇక ఈ క్రమంలోనే సి కళ్యాణ్, దిల్ రాజుల మధ్య మరో వార్ జరగనుందని టాలీవుడ్ వర్గాలలో ప్రచారం జరుగుతోంది.
Breaking: ‘’టైగర్ నాగేశ్వరరావు’’ యూనిట్ కి షాక్.. సినిమా నిలిపేయాలంటూ?
ఇక ఈ విషయమై సి కళ్యాణ్‌ని ఒక వెబ్ పోర్టల్ సంప్రదించగా ఆయన ఎన్నికల్లో పాల్గొంటున్నట్లు ధృవీకరించారని కధనం వెలుగులోకి వచ్చింది. మరో పక్క దిల్ రాజు కూడా గిల్డ్ నిర్మాతలతో చర్చించి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఇక ఎన్నికల ప్రక్రియ షెడ్యూల్ ప్రకారం జూలై 14 నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ కాగా దాఖలు చేసిన వాటిని ఉపసంహరించుకునేందుకు జూలై 21 చివరి డేటుగా ఫిక్స్ చేశారు. ఇక జూలై 30వ తేదీన ఓటింగ్ నిర్వహించి, అదే రోజు ఫలితాలు వెలువరించనున్నారు. ఇక ఈ ఎన్నికల్లో కూడా దిల్ రాజు గెలిస్తే ఇండస్ట్రీ బాడీలను యాక్టివ్ నిర్మాతల గిల్డ్ టేకోవర్ చేయడం ఖాయమని అంటున్నారు. అయితే ఈ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికల తర్వాత వారు ఇచ్చిన హామీల ప్రకారం ఏమీ చేయాలేదని, ఆ విషయంలో దిల్ రాజు ప్యానెల్ విఫలమైందని, అదే తన ఎన్నికల ఎజెండా అని సి కళ్యాణ్ చెబుతున్నారు. చూడాలి మరి ఏమవుతుంది అనేది. గతంలో దిల్ రాజు ఫిలిం ఛాంబర్ వైఎస్ ప్రెసిడెంట్ గా వ్యవహరించారు.