NTV Telugu Site icon

Dil Raju: ఏయ్.. ఏయ్.. దిల్ రాజు.. పెన్ అడిగి పాపను పడేసావే.. ఆహా

Dil Raju

Dil Raju

Dil Raju: టాలీవుడ్ ప్రముఖ నిర్మాతల లిస్ట్ లో దిల్ రాజు టాప్ 3 లో ఉంటుంది అంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న స్టార్స్ లో దిల్ రాజు ఒకడు. వారసుడు సినిమా కోసం దిల్ రాజు పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. ఎవరు ఎన్ని అనుకున్నా దిల్ రాజు తగ్గేదే లేదు అని చెప్పి చివరికి వారసుడును వెనక్కి తగ్గించాడు. అందరు నా మీద పడి ఏడుస్తున్నారు అని చెప్పిన దిల్ రాజునే.. స్టార్ హీరోలకు విలువ ఇస్తున్నట్లు చెప్పి తన సినిమాను చిరు, బాలయ్య సినిమాల తరువాతనే రిలీజ్ చేశాడు. ఇక తమిళ్ లో ఓ మోస్తరు విజయాన్ని అందుకున్న ఈ సినిమాలో తెలుగులో మాత్రం ఓకే అని కూడా అనిపించుకోలేకపోయింది. ఇక ఈ సినిమా విషయం పక్కన పెడితే.. దిల్ రాజు ఈమధ్యనే మరోసారి తండ్రి అయ్యిన విషయం తెల్సిందే. రాజు భార్య తేజస్వీని గతేడాది చివరిలో పండంటి మగబిడ్డకు జన్మనించింది. దిల్ రాజు మొదటి భార్య మూడేళ్ళ క్రితం చనిపోయిన విషయం తెల్సిందే. మూడేళ్ళ తరువాత తేజస్వీని హార్ట్ కింగ్ వివాహమాడాడు. పెళ్లి తరువాత మొదటిసారి ఈ జంట ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తమ లవ్ స్టోరీని చెప్పుకొచ్చారు.

తేజస్వీని .. ఒక ఎయిర్ హోస్ట్రెస్ అంట.. నిజానికి ఆమె పీహెచ్‌డీ కోసం అమెరికాకి వెళ్లి పోదామని అనుకుంటున్నా సమయంలో దిల్ రాజు పరిచయమవ్వడం, ప్రేమ, పెళ్లి చకచకా జరిగిపోయాయని చెప్పుకొచ్చింది. ఇక వీరిద్దరి పరిచయం కూడా చాలా సినిమాల్లో జరిగినట్లే జరిగిందని చెప్పుకొచ్చారు. అమెరికాకు వెళ్లే విమానంలో రోజు దిల్ రాజు, తేజస్వీనిని చూసేవాడట.. ఒకరోజు ఆమెను పిలిచి పెన్ ఇవ్వమని అడిగి ఆమెను పరిచయం చేసుకున్నాడట. ” నేను అమెరికా వెళ్లే షిఫ్ట్స్ తెలుసుకొని ఆయన అదే సమయంలో విమానం ఎక్కేవారు… మొదటిసారి నన్ను పెన్ అడిగారు.. ఇక అలా అలా మా ఇద్దరి పరిచయం ఏర్పడి.. పెళ్లివరకు వచ్చింది” అని చెప్పుకొచ్చింది. ఇక దీంతో దిల్ రాజు పై నెటిజన్స్ తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఆహా.. దిల్ రాజు పెన్ అడిగి పాపను పడేశావ్.. అని కొందరు.. ఏయ్.. ఏయ్ హార్ట్ కింగ్.. గట్టిగా పులిహోర కలిపావ్ గా అని మరికొందరు మీమ్స్ రూపంలో చెప్పుకొస్తున్నారు.

Show comments