Site icon NTV Telugu

Dil Raju: దిల్ రాజు సొంత ఓటిటీ.. అసలు నిజం ఏంటి ..?

Dil Raju

Dil Raju

Dil Raju: ప్రస్తుతం థియేటర్ల హంగామా అంతకుముందులా లేదు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. నిజం చెప్పాలంటే ఇప్పుడంతా ఓటిటీనే నడుస్తోంది. నెట్ ఫ్లిక్స్, అమెజాన్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, జీ5, ఆహా.. ఇలా అన్నీ ఓటిటీలలో తమదైన సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా నిర్మాతలు అయితే తమ సినిమాలను తమ ఓటిటీలో రిలీజ్ చేసుకొని డబ్బును ఆదా చేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ప్రముఖ నిర్మాత దిల్ రాజు సైతం కొత్త ఓటిటీ స్టార్ట్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దాని కోసం కంటెంట్ క్రియేషన్ మీద ఇప్పుడు ఆయన దృష్టిసారించాడని, ఒక బడ్జెట్ పెట్టి దాదాపు 25 చిన్న సినిమాలను నిర్మించే ప్రయత్నంలో రాజు ఉన్నాడని వార్తలు వచ్చాయి. ఇందుకోసం ఆయనతో మరికొందరు నిర్మాతలు కూడా చేతులు కలుపుతున్నారట. ఒక్కరే భారీ పెట్టుబడి అంటే కష్టమవుతుంది. అందుకే తలో చేయి వస్తున్నట్లు కూడా చెప్పుకొచ్చారు.

Manchu Manoj: నేను ఆ పని చేస్తే.. ఆళ్లగడ్డ నుంచి బాంబ్ లు పడతాయి

ఇక దీనిపై దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ క్లారిటీ ఇచ్చింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ట్వీట్ చేస్తూ.. “మా నిర్మాత దిల్ రాజు గారు OTT ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభిస్తున్నట్లు వస్తున్న పుకార్లపై మేము ఖండిస్తున్నాము. దయచేసి ఈ ఫేక్ వార్తలను రాయడం ఆపండి. ఇలాంటి వార్తలను స్ప్రెడ్ చేయడం మానుకోవాలని ప్రతి ఒక్కరిని అభ్యర్దిస్తున్నాము” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ ఒక్క ట్వీట్ తో ఈ వార్తలకు చెక్ పడినట్టే.

Exit mobile version