NTV Telugu Site icon

Dil Raju Son : దిల్ రాజు కొడుకు ఎలా ఉన్నాడో చూశారా?…. మొదటి సారిగా ఫొటో లీక్!

Dil Raju Son Photo

Dil Raju Son Photo

dil raju son photo: సినిమాల మీద ప్యాషన్ తో డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ మొదలుపెట్టి దిల్ సినిమాతో నిర్మాతగా మారాడు వెంకట రమణారెడ్డి. ఆ మొదటి సినిమాతో సూపర్ హిట్ అందుకుని దాన్నే ఇంటిపేరుగా మార్చుకుని టాలీవుడ్ లోనే అగ్ర నిర్మాత, అగ్ర డిస్ట్రిబ్యూటర్ గా ఎదిగాడు దిల్ రాజు. అయితే కొన్నేళ్ల క్రితం దిల్ రాజు భార్య అనిత అనారోగ్య సమస్యలతో మరణించడంతో ఆయన కుమార్తె ప్రోత్సాహంతో రెండో వివాహం చేసుకున్నాడు. కరోనా లాక్ డౌన్ సమయంలో తేజస్విని అనే అమ్మాయిని రెండో వివాహం చేసుకుని ఆమెకు వైఘా రెడ్డిగా పేరు కూడా మార్చాడు దిల్ రాజు. గత సంవత్సరం వైఘా ఓ బాబుకి జన్మనివ్వడంతో 50 ఏళ్ళ వయసులో దిల్ రాజు వారసుడిని పొందినట్టు అయింది.

SS Rajamouli: ఆర్ఆర్ఆర్ టీమ్లో ఆరుగురికి ఆస్కార్ ఆహ్వానం.. జక్కన్న రియాక్షన్ ఇదే!

అయితే బాబు పుట్టినప్పుడు దిల్ రాజు ఎత్తుకున్న ఫొటో తప్ప అప్పటి నుంచి బాబు ఫోటో ఒక్కటి కూడా బయటకు రాలేదు. తాజాగా దిల్ రాజు కొడుకు ఫొటో ఒకటి వైరల్ గా మారింది. బాబుని టేబుల్ పై నిలబెట్టి దిల్ రాజు పట్టుకున్నారు. పక్కనే వైఘా కూడా కనిపిస్తోంది. ఇక బాబు పుట్టిన తర్వాత మొదటిసారి ఫోటో బయటకు రావడంతో వైరల్ గా మారింది. ఇక మరోపక్క దిల్ రాజు తన వారసుడి మొదటి పుట్టినరోజు గ్రాండ్ గా చేయాలని చూస్తున్నాడట. వచ్చే నెలలో బుడ్డోడి పుట్టినరోజు కావడంతో ఇప్పటి నుంచే ఆ ప్రిపరేషన్స్ మొదలు పెట్టాడని తెలుస్తోంది. ఈ మధ్య తెలుగుతో పాటు తమిళ సినీ పరిశ్రమ మీద కన్నేసిన దిల్ రాజు తమిళ్, బాలీవుడ్ ప్రముఖులను కూడా పిలిచి ఆతిధ్యం ఇవ్వనున్నారని టాక్.

Show comments