ప్రముఖ నిర్మాత దిల్ రాజు బుట్టబొమ్మ పూజా హెగ్డేపై ప్రశంసల వర్షం కురిపించారు. పూజా మన కాజా అంటూనే అడుగు పెడితే హిట్టే అంటూ ఆకాశానికెత్తేశారు. అంతేనా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కు డేట్స్ ఇవ్వమని కూడా అడిగేశారు. టాలీవుడ్ లోనే టాప్ ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజు హీరోయిన్ పూజా హెగ్డే గురించి ఇలా పొయెటిక్ గా చెప్పడం అందరినీ ఆకట్టుకుంది. అయితే అసలు ఆయన పూజాపై ఈ పొగడ్తల వర్షం ఎప్పుడు ? ఎక్కడ కురిపించారంటే…
Read Also : Will Smith : 10 ఇయర్స్ బ్యాన్… అకాడమీ నిర్ణయంపై హీరో రియాక్షన్
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, పూజాహెగ్డే జంటగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో “బీస్ట్” అనే యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఏప్రిల్ 13న విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం సినిమా ప్రమోషన్లలో మేకర్స్ బిజీగా ఉన్నారు. నిన్న “బీస్ట్” తెలుగు రిలీజ్ కు సంబంధించి ప్రెస్ మీట్ ను నిర్వహించారు మేకర్స్. ఇందులో ఒక్క విజయ్ తప్ప చిత్రబృందం మొత్తం పాల్గొన్నారు. ఇక “బీస్ట్”ను తెలుగులో విడుదల చేస్తున్న దిల్ రాజు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ పూజా హెగ్డేపై పాన్ ఇండియా స్టార్ అంటూ ప్రశంసలు కురిపించారు దిల్ రాజు. ఇక మన బుట్టబొమ్మ కూడా స్టార్ ప్రొడ్యూసర్ పొగడ్తలకు పొంగిపోయింది.
