Site icon NTV Telugu

Dil Raju: జవాన్ తో పాటు రిలీజైనా నిలదొక్కుకుంది.. ‘మిస్ శెట్టి’కి దిల్ రాజు ప్రశంసలు

Dil Raju Film Chamber President

Dil Raju Film Chamber President

Dil Raju Praises Miss Shetty Mr Polishetty: నవీన్ పొలిశెట్టి. అనుష్క జంటగా నటించిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకొచ్చి హిట్ టాక్ అందుకుంది. ఈ సినిమా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల అప్రిషియేషన్స్ తో పాటు చిత్ర పరిశ్రమలోని స్టార్ హీరోలు, హీరోయిన్స్, డైరెక్టర్స్ నుంచి ప్రశంసలు అందుకుంటోండగా తాజాగా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు అభినందించారు. హైదరాబాద్ లోని యూవీ క్రియేషన్స్ ఆఫీస్ లో జరిగిన ప్రెస్ మీట్ లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకులు మంచి సినిమాలను ఆదరిస్తారని మరోసారి ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో ప్రూవ్ చేశారని ఎందుకంటే ఈ సినిమా జవాన్ తో పాటు రిలీజైనా స్టడీగా నిలదొక్కుకుందని అన్నారు. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా చూస్తున్నప్పుడు మంచి ఫీల్ కలిగిందన్న ఆయన నవీన్ పోలిశెట్టి తన క్యారెక్టర్ లో నవ్విస్తూనే ఉన్నాడని, అలాగే అనుష్క యాక్టింగ్ తో ఎమోషనల్ అయ్యేలా చేస్తోందని అన్నారు. సినిమా ఫినిష్ అయ్యేప్పటికి ఒక మంచి సినిమా చూశాననిపించిందన్న ఆయన వెంటనే యూవీ వంశీకి, నవీన్ కు ఫోన్ చేశానని అన్నారు.

Rajinikanth: పీఎంతో జైలర్ భేటీ!

మీరు మంచి సినిమా చేశారు. మౌత్ టాక్ బాగుంది, దీన్ని ప్రజల దగ్గరకు మరింతగా తీసుకెళ్లాలి అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టమని నేనే అడిగానని అన్నారు. గుడ్ ఫిలింస్ వచ్చినప్పుడు వాటిని మనమంతా ఎంకరేజ్ చేయాలి, మీరు ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారని తెలుసని అన్నారు. ఇంకా సినిమా చూడని వాళ్లుంటే వాళ్లు చూసేలా ప్రమోట్ చేసుకోవాలని, మీరు ఎక్కడికి రమ్మన్నా ఈ సినిమా ప్రచారం కోసం వస్తానని అన్నారు. నాలుగు వారాల దాకా ఈ సినిమా స్టడీగా వెళ్తుందనే నమ్మకం ఉందన్న ఆయన ఇవాళ మ్యాట్నీస్ కూడా ఫుల్ అయ్యాయని అన్నారు. ఒక కొత్త పాయింట్ ను ప్రేక్షకులకు ఈ సినిమా ద్వారా చెప్పారని, ఫిల్మ్ పూర్తయ్యేసరికి ఒక గుడ్ మూవీ చూసిన ఫీల్ కలిగించారని అన్నారు. జవాన్ ను తట్టుకుంటూ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా నిలబడగలిగిందని, స్ట్రాంగ్ కలెక్షన్స్ తో ముందుకెళ్తోందన్నారు.

Exit mobile version