Dil Raju launches Krishna Gadu Ante Oka Range Trailer: రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న యూత్‌ఫుల్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ ‘కృష్ణ గాడు అంటే ఒక రేంజ్`. శ్రీ తేజస్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై పెట్లా కృష్ణమూర్తి, పెట్లా వెంకట సుబ్బమ్మ, పిఎన్‌కే శ్రీలత సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్ట్ 4న సినిమా రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా బుధవారం టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సినిమా ట్రైలర్‌ను విడుదల చేస్తారు. ఈ సంధర్భంగా సినిమా సక్సెస్ కావాలని చిత్ర యూనిట్‌ను అభినందించారు. ఇక గతంలో ఎన్నో హిట్ సినిమాలకు దర్శకత్వ శాఖలో పని చేసిన రాజేష్ దొండపాటి ఈ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమవుతున్నారు.
Sai Dharam Tej: ఆ రోజు వణికిపోయా.. మావయ్య దెబ్బకు సెట్ అయ్యా!
ఇప్పటి వరకు రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్, సాంగ్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడంతో ఈ ప్రేమ కథపై జనాల్లో ఆసక్తి ఏర్పడింది. కొత్త హీరో హీరోయిన్లను పరిచయం అవుతున్న ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే ఓ వైపుకు యూత్‌కు నచ్చే ఎలిమెంట్స్‌తో పాటు సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలున్నాయని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాలో రఘు, స్వాతి పొలిచర్ల, సుజాత, వినయ్ మహదేవ్ వంటి వారు కీలక పాత్రలు పోషిస్తుండగా.. ఎడిటర్‌గా సాయి బాబు తలారి పని వ్యవహరిస్తున్నారు. వరికుప్పల యాదగిరి పాటలు అందించిన ఈ సినిమా ఆగస్ట్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. సాబు వర్గీస్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాకి ఎస్కే రఫీ డీవోపీగా వ్యవహరిస్తున్నారు.