Dil Raju: టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మరో కొత్త ప్రొడక్షన్ హౌస్ ను ఓపెన్ చేస్తున్నట్లు ప్రకటించాడు. దిల్ రాజు ప్రొడక్షన్స్ (DRP) పేరుతో కొత్త ప్రొడక్షన్ హౌస్ ను ఓపెన్ చేశాడు. ఇక ఈ ప్రొడక్షన్ హౌస్ కు తన కూతురు హన్షిత రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తోందని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఈ ప్రొడక్షన్ కంపెనీ నుంచి మొదటి సినిమాగా ‘బలగం’వస్తుందని చెప్పుకొచ్చాడు. ఇక ఈ ప్రొడక్షన్ లాంచ్ ఈవెంట్ లో దిల్ రాజు మాట్లాడుతూ “దిల్ రాజు ప్రొడక్షన్స్ (DRP) పేరుతో కొత్త ప్రొడక్షన్ హౌస్ లాగా.. కొత్త సినిమాలు, ఎక్స్పరిమెంటల్ సినిమాలు ఈ బ్యానర్ పై తీయబోతున్నాం. హర్షిత్, హన్షిత నిర్మాతలు. ఇంతకు ముందు ఈ బ్యానర్ పై ఏటీఎం అనే వెబ్ సిరీస్ తీసాం.. ఇప్పుడు బలగం అనే సినిమా తీస్తున్నాం.
జబర్దస్త్ వేణు దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు.. మొదట శ్రీ వెంకటేశ్వర బ్యానర్ స్టార్ట్ చేసినప్పుడు కొత్త కొత్త డైరెక్టర్స్ ను, నటీనటులను, టెక్నీషయన్స్ ను పరిచయం చేశాం. తరువాత తరువాత మేము ఎదుగుతున్న కొద్దీ అందరిలోనూ ఒకటే భయం.. రాజు గారి దగ్గరకు వెళితే పెద్ద సినిమాలే తీస్తాడు అని అనుకుంటున్నారు. ఇలా కాకుండా మారుతున్న ట్రెండ్ ను బట్టి మా నెక్స్ట్ జనరేషన్ కూడా చిత్ర పరిశ్రమలోకే వచ్చారు. చిన్న చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయడానికి ఈ బ్యానర్ స్టార్ట్ చచేశాం. అందులో మొదటిగా బలగం తీస్తున్నామని” చెప్పుకొచ్చారు
