NTV Telugu Site icon

Dil Raju: ప్రకాశ్ రాజ్ ని పట్టుకుని భోరున ఏడ్చేసిన దిల్ రాజు

Dil Raju Crying

Dil Raju Crying

Dil Raju Crying at his father final rites: టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు ఇంట తీవ్ర విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. దిల్‌ రాజు తండ్రి శ్యామ్‌ సుందర్‌ రెడ్డి సోమవారం (అక్టోబర్ 9)న నాడు కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 86 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం సాయంత్రం ఆరోగ్యం విషమించగా తుదిశ్వాస విడిచారు. దీంతో దిల్ రాజు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. దిల్‌రాజు తండ్రి మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు, సెలబ్రెటీలు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతూ విషాద సమయంలో దిల్ రాజుకు మనోధైర్యం అందించే ప్రయత్నం చేస్తున్నారు.

Ram Charan: లియోను లేపడానికి.. చరణ్ పేరును వాడుతున్నారు కదరా..?

ఇక ఈ రోజు శ్యామ్‌ సుందర్‌ రెడ్డి అంత్యక్రియలను హైదరాబాదులోని దిల్ రాజు నివాసంలో జరిపారు. ఇక ఈ క్రమంలో దిల్ రాజు ఇంటికి వెళ్లిన చిరంజీవి… శ్యాం సుందర్ రెడ్డికి నివాళి అర్పించగా ఆ తరువాత రామ్ చరణ్ కూడా దిల్ రాజు ఇంటికి వెళ్లి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. ఇక మరోవైపు దిల్ రాజు తండ్రి అంత్యక్రియల్లో ప్రకాష్ రాజ్ కూడా స్వయంగా పాల్గొన్నారు. దిల్ రాజుకు తన వంతుగా తాను ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా తన తండ్రిని కోల్పోయిన బాధను ఆపుకోలేక పోయిన దిల్ రాజు… ప్రకాశ్ రాజ్ ను పట్టుకుని భోరుమని ఏడవగా అవన్నీ కెమెరాల కంటికి చిక్కారు.. ఇక దిల్ రాజుకు ధైర్యం కలిపించాలని ఆయన అభిమానులు కామెంట్ చేస్తున్నారు.