Dil Raju Crucial Comments on TFC Elections: రేపు అంటే జూలై 30న తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ఎలక్షన్స్ జరగనున్నాయి. ఇక ఈ తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ పదవికి పోటీలో దిల్ రాజు, సి కళ్యాణ్ ఉన్నారు. ఈ క్రమంలో దిల్ రాజు కార్యాలయంలో దిల్ రాజు ప్యానెల్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ క్రమంలో దిల్ రాజు మాట్లాడుతూ రేపు జరిగే ఎన్నికల్లో 4 సెక్టర్స్ సభ్యులు పాల్గొననున్నారని, ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్న సభ్యులతో దిల్ రాజు ప్యానెల్ ఉందని అన్నారు. దిల్ రాజు ప్యానెల్ అంటే యాక్టివ్ ప్యానెల్ అని పేర్కొన్న ఆయన నాలుగు సెక్టార్స్ కి సమస్యలు ఉన్నాయని అన్నారు.
Prudhvi Raj: అంబటి ఆస్కార్ స్థాయి నటుడా.. అంత సీన్ లేదు!
ఇక చాలా ఐడియాలతో మా ప్యానెల్ వస్తుందని, ఎగ్జిబిటర్స్ కు, నిర్మాతలకు సమస్యలు ఎక్కువయ్యాయని దిల్ రాజు అన్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ ని అందరం ఐక్యతతో ఇంకా ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్న ఆయన ఇక్క ఒక్కొక్కరికి పది బ్యానర్లు ఉన్నాయి కానీ ఒక మనిషికి ఒక ఓటు ఉండాలని అన్నారు. ఇక తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ లో సభ్యులు మొత్తం 1500 మంది పైన వున్నారు కానీ యాక్టివ్ గా ఉండేది 150 మంది మాత్రమే అని అన్నారు. మూడు సంవత్సరాలలో సినిమా తీసిన వాళ్ళు మాత్రమే ఈ చాంబర్ లో కూర్చోవాలి అని చెప్పాము కానీ దానికి వాళ్ళు ఒప్పుకోలేదని అన్నారు. ఇక్కడ సక్సెస్ లేకపోతే వెనకపడిపోతామని పేర్కొన్న దిల్ రాజు అందుకే మేము గిల్డ్ పెట్టామని మా కున్న సమస్య అయితే చాంబర్ బైలాలో మార్పులు జరగాలని అన్నారు. 50 ఏళ్ల క్రితం ఫిక్స్ చేసిన బైలాలో మార్పులు రావాలని పేర్కొన్న ఆయన బైలాస్ ని మార్చుకొని ముందుకు వెళితే ఫ్యూచర్ జనరేషన్ కి ఇబ్బందులు లేకుండా ఉంటుందని అన్నారు.
ఇక గిల్డ్ కౌన్సిల్ కి వెళ్దాము అనుకున్నప్పుడు మాకు కొన్ని ప్రపోజల్స్ వచ్చాయని అన్నారు. ఇన్సూరెన్స్ , ఎడ్యుకేషన్, మ్యారేజెస్ అవన్నీ సభ్యుల కోసం చేస్తున్నామని దిల్ రాజు అన్నారు. మా ఆఫీస్ లో, ఇంట్లో ఇష్టం లేదు కానీ ఈ సభ్యుల కోసం నేను ఛాంబర్ లో ఎలక్షన్స్ పోటీలో ఉన్నానని పేర్కొన్న దిల్ రాజు మేము వస్తే ఛాంబర్ ను స్ట్రెంత్ చేస్తామని అన్నారు. క్యూబ్, యూఎఫ్ఓ రేట్లు దేశంలో అన్ని చోట్ల ఒకటే ఉందని, ఇది మన ఒక్క సమస్య కాదు అందరికి ఇదే సమస్య అని అన్నారు. సౌత్, నార్త్ వాళ్ళందరిని కలుపుకొని క్యూబ్ యూఎఫ్ఓ సమస్యలను అధిగమించాలని పేర్కొన్న ఆయన మాకు రెండు సంవత్సరాలు అవకాశం ఇస్తే మేము ఏమి చేస్తామో చూపిస్తామని అన్నారు. గతంలో నేను షూటింగ్స్ అపి ఒక ప్రయత్నం చేసా అని పేర్కొన్న ఆయన ఇండస్ట్రీ బాగుండాలి అంటే దిల్ రాజు కావాలా వద్దా అని ఆలోచించుకోవాలని చెప్పుకొచ్చారు.