Dil Raju at Mangalavaaram Movie Sucess Meet: యువ దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ‘మంగళవారం’ సినిమాలో పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో నటించారు. స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ కలిసి నిర్మించారు. నందిత శ్వేత, దివ్య పిళ్లై, రవీంద్ర విజయ్, అజయ్ ఘోష్, శ్రీ తేజ్, శ్రవణ్ రెడ్డి సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించగా నవంబర్ 17న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైంది. సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ లభించి మంచి వసూళ్లు వస్తున్న నేపథ్యంలో శనివారం సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ క్రమంలో ‘దిల్’ రాజు మాట్లాడుతూ ” మనం చాలా మంది దర్శకులను చూశాం, కొంత మంది దర్శకులు ప్రేక్షకులకు నచ్చేలా తీర్చిదిద్దడానికి ట్రై చేస్తారు, కొందరు తాము అనుకున్నది చెప్పాలని ట్రై చేస్తారు. బాలచందర్, వంశీ, రామ్ గోపాల్ వర్మ, కృష్ణవంశీ వంటి దర్శకులు తాము అనుకున్న పాయింట్ చెప్పాలని ట్రై చేస్తారు, అజయ్ కూడా అంతే. మూడో సినిమా కొత్తవాళ్ళతో చేస్తున్నాడని తెలిసి ‘అజయ్… ఏం చేస్తున్నావ్’ అని అడిగా, ‘మంగళవారం’ పోస్టర్ పంపించాడు. అది నాకు ఆసక్తిగా అనిపించగా ‘సార్… మీరు అరగంట టైం ఇస్తే కథ చెబుతా అన్నాడు.
Ajay Bhuapathi: నా చేయి తీసుకుని గుండె మీది పెట్టి చూడమన్నాడు
కథ విన్నా, అప్పుడు షూటింగుకు వెళ్లబోతున్నాడు, కొత్తగా ట్రై చేస్తున్నావని చెప్పా. నాకు ఈ కథ విన్నప్పుడు వంశీ గారి ‘అన్వేషణ’ గుర్తుకు వచ్చింది, ఆ సినిమా ఎలా ఎంజాయ్ చేశానో… కథ విన్నప్పుడు అలా ఎంజాయ్ చేశా. ముందుకు వెళ్ళమని చెప్పా, అప్పుడు స్వాతి ప్రొడ్యూస్ చేస్తున్నారని చెప్పాడు, తాను అనుకున్నది వచ్చే వరకు ఆర్టిస్టులు, టెక్నీషియన్లను వదిలిపెట్టి ఉండదు. కథ నచ్చడంతో నైజాం తీసుకున్నా, ప్రీమియర్లు వేయాలని అనుకున్నట్లు చెప్పారు. ‘ముందు నాకు చూపించండి, బావుంటే ఓకే. ఒకవేళ మిస్ ఫైర్ అయితే కష్టం’ అన్నాను. బుధవారం ఉదయం షో వేశారు, కథ నాకు తెలిసినా సాధారణ ప్రేక్షకుడిలా చూశా. ఇంటర్వెల్ అవ్వగానే ఆసక్తిగా ఉందని చెప్పా. సెకండాఫ్ ఫస్ట్ 20 నిమిషాలు ‘వావ్’ అనిపించాడు. ‘అరుంధతి’ సినిమా ఇక్కడే చూశా, అప్పుడు ఏదైతే ఫీల్ కలిగిందో… అలా అనిపించింది. ప్రీ క్లైమాక్స్ నుంచి ఒక్కో పార్ట్ రివీల్ చేస్తూ వచ్చాడు. ఈ రోజు ప్రేక్షకులు సినిమా బావుందని అనడానికి కారణం క్లైమాక్స్, ఆ ట్విస్టులు, ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ దర్శకుడికి ఇవ్వాలి. కొత్తవాళ్లుతో, కొత్త నిర్మాతలతో సినిమా చేయడం అంత ఈజీ కాదు. కథ విన్నప్పుడు, సినిమా చూసినప్పుడు ఏం ఫీల్ అయ్యానో… ఇప్పుడు ప్రేక్షకులు చెప్పినప్పుడు కూడా అదే ఫీల్ అయ్యా. నైజాంలో శుక్రవారం ఉదయం 18 లక్షలు, మ్యాట్నీ 20 లక్షలు, ఈ రోజు ఉదయం 15 లక్షలు, మ్యాట్నీ 25 లక్షల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. మౌత్ టాక్ ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారని చెప్పడానికి ఇదే సాక్ష్యం అని చెప్పారు.