Site icon NTV Telugu

Yellamma: త్వరలో నాని ‘ఎల్లమ్మ’.. దిల్ రాజు చెప్పేశాడు!

Dil Raju Film Chamber President

Dil Raju Film Chamber President

Dil Raju Announces Yellamma with Nani Venu Yeldandi: తెలుగులో విలక్షణ సినిమాలు చేసే అతి కొద్ది మంది హీరోలలో న్యాచురల్ స్టార్ నాని ఒకరు. హీరోగా విలక్షణమైన పాత్రలు చేయడానికి ఆసక్తికరమైన కథలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతానికి నాని వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సరిపోదా శనివారం అనే సినిమా చేస్తున్నాడు. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన తెలుగు రాష్ట్రాల హక్కులు కూడా దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ కొనుగోలు చేసింది. ఈ సినిమా నాని తర్వాత ఎలాంటి సినిమాలు చేయబోతున్నాడు అనే విషయం మీద ఆయనే గతంలో క్లారిటీ ఇచ్చాడు.

Lambasingi: కళ్యాణ్ కృష్ణ కురసాల సమర్పించు “లంబసింగి”!

బలగం వేణు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నట్టు నాని ప్రకటించాడు. ఒకప్పుడు కమెడియన్ గా అనేక సినిమాల్లో కనిపించి బలగం అనే సినిమాతో దర్శకుడిగా మారారు వేణు ఎల్దండి. నానితో వేణు చేయబోయే కధ తెలంగాణ ప్రాంతంలో జరిగే ఒక పీరియాడిక్ లవ్ స్టోరీ అని అంటున్నారు. త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలైన తర్వాత ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా చేస్తారని టాక్ వినిపిస్తోండగా ఈరోజు తన సోదరుడి సినిమా ప్రమోషన్స్ లో ఈ విషయాన్ని ప్రకటించాడు దిల్ రాజు. ఈ సినిమాని దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ నిర్మించబోతున్నట్టు ఈ ప్రకటనతో క్లారిటీ వచ్చేసింది. ఇక నాని తప్ప ఇంకా టీంకి చెందిన వివరాలు ఏవీ అయితే బయటకు రాలేదు. ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టిన అనంతరం అధికారిక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది.

Exit mobile version