Site icon NTV Telugu

Diesel: రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా ‘డీజిల్’!

Diesel First Look Poster

Diesel First Look Poster

తమిళ నటుడు హరీశ్‌ కళ్యాణ్ తెలుగులోనూ ‘జై శ్రీరాం’, ‘కాదలి’, ‘జెర్సీ’ చిత్రాలలో నటించాడు. తాజాగా హరీశ్‌, అతుల్య రవి ‘డీజిల్’ అనే సినిమాలో జంటగా నటిస్తున్నారు. హరీశ్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను దర్శక నిర్మాతలు ముత్తుసామి, ఎం. దేవరాజు విడదుల చేశారు. ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ ను తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ పోస్టర్‌లో ఒకదానిలో డీజిల్ ట్యాంక్‌ ని పట్టుకున్న హరీష్ కళ్యాణ్, ఓణీలో అందంగా కనిపిస్తున్న అతుల్యను రొమాంటిక్ గా చూస్తుండగా, మరో పోస్టర్ లో ఇంటెన్స్ మోడ్ లో డీజిల్‌ ట్యాంక్‌ పైపు పట్టుకుని టెర్రిఫిక్ గా కనిపించాడు హరీష్ కళ్యాణ్. రొమాన్స్ తో పాటు యాక్షన్ ని జోడించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని పెంచాయి.

ధిబు నినన్ థామస్ సంగీతం సమకూర్చుతున్న ఈ చిత్రానికి ఎం. ఎస్. ప్రభు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. షాన్ లోకేష్ ఎడిటర్ గా, రెంబన్ ఆర్ట్ డైరెక్టర్ గా, రాజశేఖర్ స్టంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version