NTV Telugu Site icon

Tripti Dimri: త్రిప్తి ప్లేస్ లో ఆ హీరోయిన్.. ఉహించుకోవడమే కష్టంగా ఉందే

Joya

Joya

Tripti Dimri: బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, రష్మిక జంటగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం యానిమల్. డిసెంబర్ 1 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. A రేటెడ్ మూవీ అయినా కూడా ప్రేక్షకులు ఓ రేంజ్ లో హిట్ చేశారు. ఎన్ని విమర్శలు వచ్చినా రికార్డ్ కలక్షన్స్ తో దూసుకెళ్లిపోతుంది. ఇక సినిమా మొత్తానికి పేరు రావడం ఒక ఎత్తు అయితే.. ఇందులో సెకండ్ హీరోయిన్ గా నటించిన త్రిప్తి దిమ్రికి పేరు రావడం మరో ఎత్తు. హీరోయిన్ రష్మిక కన్నా త్రిప్తికే పేరు వచ్చింది. ప్రస్తుతం ఆమె నేషనల్ క్రష్ గా మారిపోయింది. అయితే త్రిప్తి కన్నా ముందు.. ఈ పాత్రకోసం ఒక స్టార్ హీరోయిన్ ను తీసుకున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె ఎవరో కాదు సారా అలీఖాన్. బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ ఆలీఖాన్ ముద్దుల తనయ.

మొదట జోయా పాత్ర కోసం సారాను సంప్రదించారని, ఆమె కూడా ఓకే చెప్పిందని .. అయితే కొంత షూట్ అయ్యాక సందీప్ కు నచ్చక ఆమెను తీసేశారని వార్తలు వచ్చాయి. ఇక వీటిపై యానిమల్ టీమ్ స్పందించింది. జోయా పాత్రలో త్రిప్తి కన్నా ముందు సారా ఆలీఖాన్ ను సంప్రదించాం అన్న వార్తలో ఎలాంటి నిజం లేదు. మొదటినుంచి త్రిప్తినే అనుకున్నాం. ఆమెతోనే సినిమా పూర్తిచేశాం.. అసలు సారాను సందీప్ కలిసింది కూడా లేదు అని చెప్పుకొచ్చారు. ఇక దీంతో ఈ పుకార్లకు చెక్ పడినట్లు అయ్యింది. ఈ వార్త విన్న నెటిజన్స్.. జోయా పాత్రలో సారాను ఉహించుకోవడమే కష్టంగా ఉందే అంటూ చెప్పుకొస్తున్నారు. మరి ఈ సినిమా ఇచ్చిన పేరుతో త్రిప్తి ఎలాంటి సినిమాలను అందుకుంటుందో చూడాలి.

Show comments