NTV Telugu Site icon

Sai Pallavi: లేడీ పవర్ స్టార్ ను పట్టించుకోరేంటి..?

Sai Pallavi

Sai Pallavi

Sai Pallavi: ఫిదా సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి కుర్రకారును తన డ్యాన్స్ తో, నటనతో ఫిదా చేసిన హీరోయిన్ సాయి పల్లవి. అందాలను ఆరబోస్తేనే స్టార్ హీరోయిన్ అనిపించుకునే ఈ రంగంలో .. ఎటువంటి అందాలను ఆరబోయకుండా.. ఎటువంటి గ్లామర్ రోల్స్ చేయకుండా, లిప్ కిస్ లు లాంటివి ప్రయత్నించకుండా తన పాత్రకు ప్రాధాన్యత ఇచ్చే సినిమాలను చేస్తూ మెప్పిస్తుంది సాయి పల్లవి. ఒక్క నటనలోనే కాకుండా వ్యక్తిత్వంలో కూడా ఔరా అనిపిస్తూ హృదయాలను కొల్లగొట్టి లేడీ సూపర్ స్టార్ అనిపించుకుంటుంది. ఈ మధ్యకాలంలో సినిమాల్లో కనిపించకపోయినా అమ్మడికి ఉన్న క్రేజ్ మాత్రం మామూలుది కాదు. అయితే ఆ క్రేజ్ కొద్దికొద్దిగా తగ్గుతుందా..? అంటే.. నిజమే అంటున్నారు నెటిజన్లు. అందుకు కారణం కూడా చెప్పుకొస్తున్నారు. అదేంటంటే.. నేడు సాయి పల్లవి పుట్టినరోజు.. అయినా సోషల్ మీడియాలో హంగామా లేదు.

Nandini Reddy: ‘అన్నీ మంచి శకునములే’ అంటున్న ‘తొలిప్రేమ’ వాసుకి!

సోషల్ మీడియాలో కొంత మంది అభిమానులు…స్నేహితులు…పరిశ్రమలో తెలిసిన వారంతా అమ్మడికి విషెస్ తెలియజేసారు. చేతిలో సినిమాలు లేకపోవడంతో ప్రొడక్షన్ హౌసెస్ విషెస్ చెప్పలేదు. సాధారణంగా ఒక బ్యానర్ లో చేసిన హీరోయిన్ కు అయితే.. ఆ బ్యానర్ నుంచి వచ్చేసిన తరువాత కూడా ఆమెకు పోస్టర్లు వేసి, వీడియోస్ పెట్టి బర్త్ డే విషెస్ చెప్తారు. కానీ సాయి పల్లవి విషయంలో అది జరగలేదు. అవకాశాలు లేకపోవడంతో మేకర్స్ కూడా లైట్ తీసుకున్నారా..? అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇంకోపక్క ఇదేరోజు విజయ్ దేవరకొండ పుట్టినరోజు కావడంతో.. రౌడీ హీరో బర్త్ డే విషెస్ లో అమ్మడు కొట్టుకుపోయింది అని చెప్పుకొస్తున్నారు. ఏదిఏమైనా లేడీ సూపర్ స్టార్ బర్త్ డే నుపట్టించుకోకపోవడమేంటని ఆమె అభిమానులు కొద్దిగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సాయి పల్లవి.. శివ కార్తికేయన్ సరసన SK21 లో నటిస్తోంది.