హాట్ యాంకర్ అనసూయ జబర్దస్త్ ను వదిలి వెళ్ళిపోతుంది అన్న వార్తలు గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో గుప్పుమంటున్నాయి. ఈ విషయంపై అనసూయ అటు ఇటు కాకుండా ఒక పోస్ట్ పెట్టి అభిమానులను కన్ప్యూజ్ చేస్తోంది. “నేను అతిపెద్ద నిర్ణయం తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు అన్ని జ్ఞాపకాలను తీసుకెళ్తున్నాను.. ఎక్కువ మంచివే ఉన్నాయి.. ఎప్పటిలానే మీ ఆదరణ నాకు ఉంటుందని నమ్ముతున్నాను” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన అనసూయ.. ఈ పోస్ట్ దేని గురుంచో మాత్రం చెప్పకుండా వదిలేసింది. ఇక దీంతో నెటిజన్లు ఇది కచ్చితంగా జబర్దస్త్ గురించే అంటూ చెప్పుకొస్తున్నారు. ఇకపోతే అనసూయ జబర్దస్త్ ను వీడడానికి కారణం మెగా బ్రదర్ నాగబాబే అని వార్తలు గుప్పుమంటున్నాయి. ఒకప్పుడు జబర్దస్త్ లో నవ్వుల నవాబు.. నాగబాబు. ఆయన లేని షో ను ఉహించుకోలేని పరిస్థితి.. అలా సాగుతున్న క్రమంలో ఛానెల్ యాజమాన్యాన్ని, నాగబాబుకు మధ్య కొన్ని విబేధాలు తలెత్తడంతో నాగబాబు జబర్దస్త్ నుంచి బయటికి వచ్చేసి వేరే ఛానెల్ లో మరో కామెడీ షో కు జడ్జిగా వ్యవహరిస్తున్నాడు.
Read Also: Anasuya: షాకింగ్.. జబర్దస్త్ కు అనసూయ గుడ్ బై..?
ఇక నాగబాబు వెళ్ళిపోయాక వరుసగా జబర్దస్త్ నుంచి మెయిన్ లీడర్స్ కూడా బయటికి వెళ్లిపోతుండడం విశేషం. హైపర్ ఆది మొదలుకొని గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్, అప్పారావు, ధనరాజ్, వేణు ఇలా ఒక్కొక్కరిగా జబర్దస్త్ నుంచి బయటికి వచ్చేశారు. ప్రస్తుతం వీరందరూ కూడా నాగబాబు జడ్జిగా వ్యవహరిస్తున్న కామెడీ షోలో నవ్వులు పూయిస్తున్నారు. వారిని బయటకు తీసుకురావడం కూడా నాగబాబు వలనే అయ్యిందని, తాజాగా అనసూయ ఈ షోను వీడడడానికి ప్రధాన కారణం మెగా బ్రదర్ అని సమాచారం. ఈ షో నుంచి వైదొలగడానికి అనసూయకు భారీగా ముట్టజెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. వేరే ఛానెల్ లో ఆఫర్స్, రెమ్యూనిరేషన్ తో పాటు పర్సనల్ గా కూడా గిఫ్ట్ లను ఇస్తున్నారట.. ఇందులో నిజం ఎంత అనేది తెలియదు కానీ మెగా బ్రదర్ కారణంగానే అనసూయ బయటికి వస్తుంది అనేది మాత్రం నిజమే అయ్యి ఉంటుందని అభిమానులు నొక్కి వక్కాణిస్తున్నారు. మరి ఈ విషయమై అనసూయ క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.
