NTV Telugu Site icon

Vijay Deverakonda: దేవరకొండ సినిమాతో తమిళ్ స్టార్ హీరో వారసుడు టాలీవుడ్ ఎంట్రీ?

Vijay Deverakonda Finally Opens Up On His Marriage

Vijay Deverakonda Finally Opens Up On His Marriage

Dhruv Vikram Cameo in Vijay Deverakonda Goutham Tinnanuri Film: విజయ్ దేవరకొండ హీరోగా జెర్సీ ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కాల్సి ఉంది. నిజానికి విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ అనే సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా కంటే ముందే వీరిద్దరి కాంబినేషన్లో విజయ్ దేవరకొండ 12వ సినిమా తెరకెక్కాల్సి ఉంది. అయితే పలు కారణాలతో ఆ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఈ సినిమాలో హీరోయిన్లుగా ఎవరు నటించబోతున్నారు అనే విషయం మీద క్లారిటీ లేదు. శ్రీ లీల నటించబోతున్నారని అధికారికంగా ప్రకటించారు కానీ ఆమె తప్పుకోవడంతో ఆమె స్థానంలో రష్మిక మందన నటించిన బోతున్నారని ఒకసారి, ఇలా రకరకాల ప్రచారాలు అయితే జరుగుతూ వస్తున్నాయి. కానీ పూర్తి సమాచారం అయితే లేదు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త తెరమీదకు వచ్చింది. అదేమిటంటే ఈ సినిమా ద్వారా ఒక తమిళ స్టార్ హీరో కొడుకు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. అతను ఎవరో కాదు విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్.

Vishwak Sen: కమల్ హాసన్, శివ కార్తికేయన్ బాటలో విశ్వక్ సేన్!

ఇక్కడ సూపర్ హిట్ గా నిలిచిన అర్జున్ రెడ్డి సినిమాని తమిళంలో రీమేక్ చేస్తే అందులో హీరోగా నటించాడు ధృవ్. ఆ తర్వాత తండ్రితో కలిసి మహాన్ అనే సినిమా చేశాడు కానీ అది ఓటీటీలో రిలీజ్ అయింది. ప్రస్తుతానికి మరో సినిమా చేసే హడావుడిలో ఉన్నాడు కానీ తెలుగులో విజయ్ దేవరకొండ, గౌతమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో ఆయన అతిథి పాత్రలో కనిపించబోతున్నాడు అని తెలుస్తోంది. తమిళ్ లో కూడా రిలీజ్ చేయడానికి అనుకూలంగా ఆయనను తీసుకున్నారని ప్రచారం ఉంది. ఇక విజయ్ దేవరకొండ 12వ సినిమాకు సంబంధించిన షూటింగ్ మార్చి రెండో వారం నుంచి మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నాగ వంశీ నిర్మించబోతున్నారు. నిజానికి సినిమా పూజా కార్యక్రమంతో మొదలుపెట్టిన సమయంలో విజయ్ దేవరకొండ, శ్రీ లీల హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారని ప్రకటించారు అయితే ఈ సినిమా నుంచి శ్రీ లీల తప్పుకుంటున్నట్టు ప్రచారం అయితే ఉంది.

Show comments