Site icon NTV Telugu

Dhostan First look Poster: హరీష్ రావు ఆవిష్కరించిన ‘దోస్తాన్’ పోస్టర్

Dhostan Trailer

Dhostan Trailer

Dhostan First look Poster: సిద్ స్వరూప్, కార్తికేయ రెడ్డి, ఇందు ప్రియ, ప్రియ వల్లభి ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘దోస్తాన్’. సూర్యనారాయణ అక్కమ్మగారి స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా నిర్మితమైంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెన్సార్ కు సిద్ధమైంది. ఈ సందర్బంగా ‘దోస్తాన్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను తెలంగాణ ఆరోగ్య శాఖా మంత్రి హరీష్ రావు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ”ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే మంచి కాన్సెప్ట్ ఉన్న కథను సెలెక్ట్ చేసుకుని తీశారనిపిస్తోంది. మంచి కథను సెలెక్ట్ చేసుకొని తెరకెక్కించిన దర్శక, నిర్మాత సూర్యనారాయణకు ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలి. అలాగే ఈ సినిమాకు పని చేసిన టీం అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.

Read Also: Ajayante Randam Moshana: త్రీడీ మూవీతో మల్లూవుడ్‌లోకి ‘ఉప్పెన’ భామ

దర్శక, నిర్మాత సూర్యనారాయణ అక్కమ్మ మాట్లాడుతూ.. ”మా ‘దోస్తాన్’ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసిన హరీష్ రావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. సిద్ స్వరూప్ అందించిన కథ నచ్చడంతో ఈ సినిమా చేశాను. తుని, లంబసింగి, తలకోన, వరంగల్, హైదరాబాద్, వైజాగ్, కాకినాడ పోర్ట్ తదితర ప్రదేశాల్లో షూటింగ్ జరిపాం. నటీ నటులు, టెక్నిషియన్స్ అందరూ ఫుల్ సపోర్ట్ చేయడంతో సినిమా చాలా బాగా వచ్చింది. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా అందరికీ తప్పకుండా నచ్చుతుంది” అని చెప్పారు. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ చిత్రం లో నటించే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాత సూర్యనారాయణకు నటుడు, కథా రచయిత సిద్ స్వరూప్ ధన్యవాదాలు తెలిపాడు.

Exit mobile version