Site icon NTV Telugu

Dasara: శృంగార తార సిల్క్ స్మితతో నానికి ఉన్న సంబంధం ఏంటి..?

Nani

Nani

Dasara: న్యాచురల్ స్టార్ నాని ఇటీవలే అంటే సుందరానికి సినిమాతో వచ్చి ప్రేక్షకులను నిరాశపర్చిన విషయం విదితమే. అయితే ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని పట్టుదలతో ఉన్న నాని మాస్ మసాలా ఎంటర్ టైనర్ తో రాబోతున్నాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని నటిస్తునం చిత్రం దసరా. ఈ సినిమాలో నాని సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఊర మాస్ లుక్ లో నాని కనిపించనున్నాడు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్ లో నాని సిల్క్ స్మిత వీరాభిమానిగా కనిపించనున్నాడట. ఈ సినిమా మొత్తం 90 వ దశకంలో జరగనుందని, అప్పట్లో టాలీవుడ్ ను ఏలిన సిల్క్ స్మిత సినిమాలకు నాని అభిమానిగా కనిపించనున్నాడట. అందుకే పోస్టర్ లో సైతం సిల్క్ స్మిత ను చూపించారట మేకర్స్. ఇక తాజాగా ఈ సినిమా నుంచి మొదటి సాంగ్ రిలీజ్ కు ముహూర్తం ఖరారు అయ్యింది.

‘దూమ్ ధామ్ దోస్తానా’ అంటూ సాగే ఈ సాంగ్ ను అక్టోబర్ 5 న రిలీజ్ చేస్తున్నట్లు నాని తెలిపాడు. ఇక ఈ సాంగ్ ఊర మాస్ స్ట్రీట్ సాంగ్స్ లో బెస్ట్ గా ఉండనున్నదని చెప్పుకొచ్చాడు. అయితే ఈ లిరిక్స్ లో సిల్క్ స్మిత గురించి కూడా ఉంటుందని చెప్పుకొస్తున్నారు.సంతోష్ నారాయణన్ సంగీతంలో రూపొందిన పాటకి ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ అందిస్తున్నారట.. నాని ఊర మాస్ స్టెప్పులు ఫ్యాన్స్ ను ఫిదా చేస్తాయని చెప్పుకొస్తున్నారు. మరి ఆ సాంగ్ ఎలా ఉండబోతుందో చూడాలంటే అక్టోబర్ 5 వరకు ఆగాల్సిందే. మరి ఈ సినిమాతోనైనా నాని హిట్ ను అందుకుంటాడా..? లేదా..? అనేది చూడాలి.

Exit mobile version