NTV Telugu Site icon

Dhimahi Trailer: చనిపోయిన వాళ్ళతో మాట్లాడచ్చా?..వణికిస్తోన్న ధీమహి ట్రైలర్

Dhimahi

Dhimahi

Dhimahi Telugu Trailer: కెప్టెన్ కుక్ ఫిలిమ్స్ పతాకంపై 7:11 PM సినిమా హీరో ఫేమ్ సాహస్ పగడాల హీరోగా నటించిన సినిమా ‘ధీమహి’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. విరాట్ కపూర్, సాహస్ పగడాల సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి స్వయంగా సాహస్ పగడాల, నవీన్ కంటె దర్శకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో నిఖిత చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. షారోన్ రవి సంగీతం అందిస్తున్న ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల అనగా అక్టోబర్ 27న విడుదలకు సిద్ధం అయింది. ఇక ఈ రోజు థియేట్రికల్ ట్రైలర్ ను సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు సినిమా యూనిట్.

Manchu Lakshmi: స్వలింగ సంపర్కుల వివాహంపై సుప్రీం తీర్పు.. గుండె పగిలిపోయింది, దేశానికి ఇది నిజమైన అవమానం!

ఇక ఈ క్రమంలోనే సినిమా మేకర్స్ మాట్లాడుతూ మా ధీమహి సినిమా ఈ నెల అక్టోబర్ 27న విడుదల అవుతుందని అన్నారు. ఈ రెండు నిమిషాల ట్రైలర్ సినిమా పై అంచనాలు పెంచుతుందని పేర్కొన్న మేకర్స్ హీరో సాహస్ పగడాల కొత్త కొత్త కాన్సెప్ట్ తో సినిమాలు చేస్తున్నాడని అన్నారు. ఇది వరకు 7:11 PM సినిమాతో టైం ట్రావెల్ అనే కాన్సెప్ట్ తో రాగా ఇప్పుడు ఆత్మల మార్పిడి కాన్సెప్ట్ తో సాహస్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడని అన్నారు. నెక్రోమాన్సీ అనగా చనిపోయిన వాళ్ళతో మాట్లాడటం అనే కొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కించారని, మొత్తం ఫారిన్ లోనే షూట్ చేశారని వెల్లడించారు. ఇక 7:11 చిత్రం లో నటించిన సాహస్ పగడాల ఈ చిత్రం లో నటించి, స్వీయ దర్శకత్వం వహించగా ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా సాగింది. చనిపోయిన మహి అనే మేనకోడలి కోసం ఆమె మామ కార్తీక్ చేసే పోరాటమే సినిమాగా అనిపిస్తోంది.