Site icon NTV Telugu

Girlfriend : సినిమా తీయడం కాదు ముందు ప్రమోట్ చేయడం నేర్చుకోండి – నిర్మాత ధీరజ్ మొగిలినేని

Dheeraj Mogilineni

Dheeraj Mogilineni

రష్మిక మందన్న, దీక్షిత్‌శెట్టి జంటగా రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో రూపొందిన ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ చిత్రం ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇందులో భాగంగా మూవీ టీ వరుస ప్రమోషన్స్ లో పాల్గోంటున్నారు. ఇందులో భాగంగా నిర్మాత ధీరజ్ మొగిలినేని వ్యాఖ్యలు ప్రస్తుత సినీ పరిశ్రమలో నిజంగానే చర్చనీయాంశంగా మారాయి. ఆయన చెప్పిన విషయాలు చాలా వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి. సినిమా తీయడం ఒక భాగం మాత్రమే, కానీ ప్రేక్షకుల ముందుకు దానిని సరైన విధంగా తీసుకురావడం మరింత ముఖ్యమని ఆయన స్పష్టంగా చెప్పారు. నేటి డిజిటల్ యుగంలో ప్రేక్షకుల దృష్టి ఆకర్షించడానికి కేవలం ట్రైలర్ రిలీజ్, ప్రీ రిలీజ్ ఈవెంట్‌లు సరిపోవని, సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో కొత్తగా ఆలోచించి ప్రమోషన్లు చేయాల్సిన అవసరం ఉందని ఆయన హితవు పలికారు.

Also Read : Devi Sri Prasad : మొత్తానికి తన పెళ్లి విషయంలో రియాక్ట్ అయిన దేవిశ్రీ ప్రసాద్‌..

‘చిన్న నిర్మాతలు ఎక్కువగా సినిమా తీయడానికి డబ్బు పెట్టి, మార్కెటింగ్‌కి మాత్రం ప్రాముఖ్యత ఇవ్వరు’ అని ఆయన వ్యాఖ్యలు వాస్తవానికి చాలా మందికి ఆలోచన కలిగించేలా ఉన్నాయి. ఇంత పెద్ద పోటీ ఉన్న కాలంలో సినిమా బాగుందన్న ఒక్క కారణంతోనే హిట్‌ అవ్వడం కష్టం. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడానికి క్రియేటివ్ ప్రమోషన్‌ ప్లాన్ తప్పనిసరిగా అవసరం. ధీరజ్ మాటల్లోని మర్మం ఏమిటంటే – ‘సినిమా తీయడం కాకుండా దాన్ని ఎలా అమ్ముకోవాలో నేర్చుకోండి’ అంటే మంచి కంటెంట్‌తో పాటు మార్కెటింగ్ వ్యూహం కూడా ఉండాలి. చివరగా ఆయన చెప్పినట్టు, నటీనటులు కూడా ప్రమోషన్లలో భాగస్వామ్యం కావాలి. ప్రేక్షకులు థియేటర్లకు రావడం కోసం కొత్తగా ఆలోచించడం, కొత్తగా ప్రయత్నించడం మాత్రమే సినిమాకు జీవం పోస్తుంది. అని తెలిపారు ప్రజంట్ ఈ మాటలు వైరల్ అవుతున్నాయి.

Exit mobile version